New Born Baby Starts Walking: కొంత మంది పిల్లలు భలే యాక్టివ్ గా ఉంటారు. ఎంతో చురుగ్గా వారి వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ మరీ పుట్టినప్పుడే రావు కొన్ని రోజుల తరువాత వస్తాయి. అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన మొదటి రోజే తన మ్యాజిక్ చూపించాడు. సాధారణంగా పుట్టిన తరువాత ఐదు నుంచి ఆరు నెల తరువాత పిల్లలు నడవడానికి ప్రయత్నిస్తారు. తరువాత ఏడాదికి బుడి బుడి అడుగులు వేస్తారు. అప్పటి వరకు వారి ఎముకలు గట్టిగా అవుతాయి. అందుకే వారు నడవగలుగుతారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన తొలిరోజే నడిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: ATM Franchise: అదిరిపోయే ఐడియా.. ఏటీఎం ఫ్రాంఛేజీతో నెలకు రూ.70,000 సంపాదించండి
ఈ వీడియోను యాక్టివ్ మామాస్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ ఓ మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఆ బుడ్డోడు పుట్టిన మొదటి రోజు నుంచే తన చేష్టలతో ఆశ్చర్యపరుస్తున్నాడు. మొదటిరోజే నడిచి డాక్టర్లను కూడా షాక్ కు గురిచేశాడు. ఈ వీడియోలో అప్పుడే పుట్టిన శిశువును ఓ నర్సు ఎత్తుకొని పట్టుకుంటుంది. ఆ బుడ్డోడు వెంటనే నడవడం మొదలు పెడతాడు. దీంతో ఆమె ఆ శిశువును ఇంకా కొంచెం నడిచేలా ప్రోత్సహిస్తుంది. ఈ వీడియోలోనే శిశివు దాదాపు 10 అడుగుల వరకు వేస్తాడు. అయితే పిల్లలు పుట్టగానే వారి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. అందుకే వారు నడవలేరు. అయితే ఈ బుడ్డోడు పుట్టిన వెంటనే నడవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన వారు కలియుగం అంటే ఇదే భాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరయితే ఆ పిల్లాడు ఇక నేను ఇక్కడ ఉండాలేను అంటూ పారిపోవడానికి అప్పుడే రెడీ అయిపోయాడు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.