NTV Telugu Site icon

Devara : దసరాకు కొత్త దేవర.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే

New Project (34)

New Project (34)

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించి బ్లాక్ బస్టర్ మూవీ దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అయింది. మొదటి రోజు నుంచి బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్ల మోత మోగిస్తుంది. రోజు రోజుకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి ఆరేళ్లు అవుతుంది. సోలో హీరోగా వస్తుండడంతో ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దాదాపు రూ.300కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ డీసెంట్ టాక్ రూ.300కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో నిరూపించింది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది.

Read Also:Dussehra 2024: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా?.. పోలీసుల హెచ్చరికలు ఇవే!

అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన ‘దావూదీ’ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ, సినిమాలో ఈ పాట ఎక్కడా కనిపించకపోవడం.. కనీసం ఎండ్ టైటిల్స్‌లో కూడా కనిపించలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనైపోయారు. అంతేగాక, హీరోయిన్ జాన్వీ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువగా ఉండటంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు దేవర టీమ్, దసరా నుండి ‘దేవర’ చిత్రంలో వీటికి సంబంధించి పలు సీన్స్‌తో పాటు సాంగ్‌ని కూడా యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో దసరా నుంచి దేవర యాడెడ్ వెర్షన్ తో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారు దసరా నుండి సరికొత్త ‘దేవర’ను చూడబోతున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Read Also:Rajinikanth : సడన్ గా హాస్పిటల్లో చేరిన రజినీకాంత్.. భయాందోళనలో అభిమానులు

Show comments