Minister KTR: ఇవాళ పుట్టినరోజు కావడం వల్ల సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును ఘనంగా జరపాలనుకున్నారు అభిమానులు. అయితే దురదృష్టం ఏమంటే.. ఇటీవల ఆయన కాలుజారి పడటంతో పాదం దగ్గర బెణికింది. మూడువారాలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. కాలిగాయంతో మంత్రి కేటీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఈ విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ విశ్రాంతి సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడటానికి తనకు సలహా ఇవ్వమని కోరారు. దాంతో చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలని సూచించారు. అభిమానులు, సెలబ్రిటీలే కాకుండా ఓటీటీ సంస్థలు కూడా శుభాకాంక్షలతో పాటు సినిమాలు, సిరీస్‌లు చూడాలని కోరాయి.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest 🙁
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRTRS) July 23, 2022
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా.. మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా.. త్వరగా కోలుకోవాలంటే ‘డీజే టిల్లు’ సినిమా చూడాలని ట్వీట్ చేసింది. బాలకృష్ణ యాంకర్‌గా వ్యవహరించిన ‘ఎన్‌బీకే అన్‌స్టాపబుల్’, అమలాపాల్ నటించిన ‘కుడి ఎడమైతే’, ప్రియమణి ‘భామాకలాపం’ కూడా మిస్ కావద్దని తెలిపింది. మరో ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 కూడా కేటీఆర్‌కు కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను చూడాలంటూ తనదైన శైలిలో ట్వీట్ చేసింది. “కేటీఆర్ గారూ గుడ్ మార్నింగ్.. ‘మా నీళ్ల ట్యాంకు’తో స్టార్ట్ చేసి, ‘రెక్కి’తో థ్రిల్ అవుతూ.. లంచ్ టైమ్‌కి ఫ్యామిలీ మొత్తం ‘ఒక చిన్న ఫ్యామిలీ’ స్టోరీ కంప్లీట్ చేసి.. రాత్రికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూసేయండి. త్వరగా రికవరీ అవుతారు. కానీ.. ఒక్క విషయం జాగ్రత్త.. ‘చూస్తూనే ఉండిపోతారు’ అంటూ ట్వీట్ చేసింది. తృణమూల్ కాంగ్రెల్ ఎంపీ డెరెక్ ఓబ్రయన్ కూడా పలు సిరీస్‌లను సూచించడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైల్డ్ కంట్రీ, స్కామ్ 1992 సిరీస్‌లు చూడాలని ఆయన సూచించారు.
Subhash patriji: పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత
నెటిజన్లు కూడా ఈ సినిమాలు, సిరీస్‌లు చూడండంటూ కొన్ని సూచనలు చేశారు. మోడ్రన్ లవ్ హైదరాబాద్ , పంచాయత్ మౌస్, కింగ్‌డం సీజన్ 1&2, డార్క్, పీకీ బ్లైండర్స్, బ్లాక్‌లిస్ట్, మిడ్‌నైట్ మాస్, హాల్ట్ అండ్ క్యాచ్ ఫైర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్ట్రేంజర్ థింగ్స్, డెసిగ్నేటెడ్ సర్వైవర్, నార్కోస్, టెహ్రాన్, రాకెట్ బాయ్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్, లాస్ట్ ఇన్ స్పేస్, మనీ హైస్ట్, ది బాయ్స్, వర్జిన్ రివర్, డీకపుల్డ్, ఒజార్క్, బెటర్ కాల్ సాల్ తదితర షోలు సూచించారు. మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆయన పర్యటనలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటుంటారు.