Site icon NTV Telugu

OTT: ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమైన నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్

Netflix Disney

Netflix Disney

OTT: ఇటీవల కుటుంబ ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఓ ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌లో ధూమపానం చేసే దృశ్యాలపై ‘సిగరెట్ స్మోకింగ్ / పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం’ అనే చట్టబద్ధమైన హెచ్చరికను ఉంచాలి. అంతే కాకుండా కంపెనీలు OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్ ప్రారంభంలో, మధ్యలో కనీసం 50 సెకన్ల పొగాకు వ్యతిరేక కంటెంట్ కూడా ఉంచాలి. ఇది ఆడియో-విజువల్ డిస్‌క్లైమర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందుకోసం OTT కంపెనీలకు 3 నెలల సమయం ఇచ్చింది. ఇప్పుడు ఇదే వారికి తలనొప్పిగా మారింది.

Read Also:Medicine Banned: 14 రకాల మందుల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లను నిషేధించిన ప్రభుత్వం

నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్, వయాకామ్ 18 (రిలయన్స్ గ్రూప్ కంపెనీ) ఈ ఆర్డర్‌కు సంబంధించి క్లోజ్డ్ డోర్ మీటింగ్‌ను నిర్వహించాయి. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఆర్డర్‌ను చట్టపరంగా సవాలు చేసే అవకాశాలపై కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. OTT ప్లాట్‌ఫారమ్‌లు తమ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నుండి ఏదైనా ఉపశమనం పొందగలరా అనే దానిపై కూడా కంపెనీల మధ్య చర్చించారు.

Read Also:Bandi Sanjay : అమిత్ షా, జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి?

ఈ కొత్త మార్గదర్శకం ప్రకారం పొగాకు వ్యతిరేక కంటెంట్ చొప్పించడానికి OTT ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్రస్తుత కంటెంట్‌ను మళ్లీ సవరించాలి. మిలియన్ల గంటల కంటెంట్‌ను సమీక్షించడం, సవరించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దాంతోపాటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే కంపెనీలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి సర్టిఫికేట్ పొందిన సినిమాలన్నీ ఇలాంటి డిస్‌క్లైమర్‌ను పెట్టాలి. అదే సమయంలో, టీవీలో ‘యాంటీ-టొబాకో’ డిస్‌క్లైమర్ ఇవ్వడం తప్పనిసరి.

Exit mobile version