NTV Telugu Site icon

Isaral-Hamas War: బందీలను తీసుకురండి, రూ.37.5 కోట్లు పట్టుకెళ్లండి.. నెతన్యాహూ సూపర్ డీల్..

Isaral Hamas War

Isaral Hamas War

Isaral-Hamas War: ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ కీలక నేతల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పర్యటించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతానికి నెతన్యాహూ వెల్లడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 07 నాటి దాడుల సమయంలో హమాస్ మిలిటెంట్లు 240కి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా పట్టుకుని గాజాలోకి వెళ్లారు. అయితే, గతేడాది నవంబర్‌లో సంధి ఒప్పందంలో భాగంగా కొందరిని విడిచిపెట్టారు. అయితే, ఇప్పటికీ 101 మంది ఇజ్రాయిలీ బందీల ఆచూకీ లభించడం లేదు.

Read Also: Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ క్లారిటీ!

తాజాగా నెతన్యాహూ తన పర్యటనలో మాట్లాడుతూ… హమాస్ సైనిక సామర్థ్యాన్ని తమ దేశ సైన్యం నాశనం చేసిందని, ఇకపై హమాస్ గాజాను పాలించబోదని అన్నారు. మా బందీలకు హాని చేయాలని చూస్తే మేము వాళ్లను వెండించి హతమారుస్తామని అన్నారు. గాజాలోని ఇప్పటీకి 101 మంది బందీలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతీ ఒక్క బందీని సురక్షితంగా తమకు అప్పగిస్తే వారికి 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 37.5 కోట్లు) బహుమతిని ప్రకటించారు.

‘‘మా బందీలను హాని చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారి తలపై రక్తం ఉంటుంది. మేము మిమ్మల్ని వేటాడి పట్టుకుంటాము. ఎవరు బందీలను తీసుకువస్తే అతను మరియు అతని కుటుంబం బయటపడటానికి సురక్షితమైన మార్గాన్ని కల్పిస్తాం. తేల్చుకోండి , ఛాయిస్ మీదే.’’ అని బంపర్ ఆఫర్ ప్రకటించారు.