NTV Telugu Site icon

UGC- NET2024: ఆదివారమే పేపర్ లీక్.. ఆ వెంటనే డార్క్ నెట్లో ప్రత్యక్షం..

Ugc

Ugc

UGC- NET2024: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పత్రాన్ని ఆదివారం నాడే లీక్‌ చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దానిని ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని తెలిపారు. దీని విచారణలో భాగంగా ప్రాథమికంగా ఈ అంశాలు బయటకు వచ్చాయి. కాగా, యూజీసీ-నెట్ పరీక్షను జూన్ 18వ తేదీన (మంగళవారం) నిర్వహించారు.

Read Also: Shruti Haasan: ఈ వివక్షలే వద్దు.. నెటిజన్‌పై శ్రుతి హాసన్‌ అసహనం!

అయితే, ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ICCCC) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్థారించుకుంది. దాంతో వెంటనే ఆ ఎక్సామ్ ను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.

Read Also: Donald Trump: మీరు గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు ఇచ్చేస్తాం..

అయితే, యూజీసీ నెట్‌ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది అప్లై చేశారు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత సాధించేందుకు, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు ఈ ఎక్జామ్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్‌టీఏ నిర్వహించిన నీట్‌ పరీక్షపై తీవ్ర వివాదం కొనసాగుతున్న వేళా.. నెట్‌ పరీక్షలోనూ అవకతకవలు జరగడంతో ఆ పరీక్ష రద్దు కావడం సంచలనం రేపుతుంది.