Site icon NTV Telugu

Nephew Kills Uncle: ఆవు విషయంలో వివాదం.. మామను కొట్టి చంపిన మేనల్లుడు

Cow

Cow

Nephew Kills Uncle: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దారుణం జరిగింది. ఆవు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలిగొంది. మామ, అతని మేనల్లుడి మధ్య వివాదం నేపథ్యంలో.. మేనల్లుడే తన స్నేహితులతో కలిసి మేనమామను కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

House Catches Fire: ఇంటి పైకప్పుకు మంటలు.. 3 ఏళ్ల బాలిక సజీవ దహనం

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్ పోలీస్ ఏరియాలోని దౌలత్‌పూర్ కుటి గ్రామంలో జరిగిన ఓ ఘటనలో మేనల్లుడు ఆవు వివాదం నేపథ్యంలో తన సహచరులతో కలిసి మేనమామను కొట్టి చంపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫిర్యాదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హాన్‌లో నివాసముంటున్న విజేందర్‌కు తన మేనల్లుడు సోనుతో ఆవు విషయంలో గొడవ జరిగింది. వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే సోను, అతని సహచరులు మామ విజేందర్‌ను తీవ్రంగా కొట్టారు. దెబ్బలు గట్టిగా తగలడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

Exit mobile version