Russia Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అనేక మంది చనిపోతున్నారని ప్రతిరోజూ వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో అమాయక పౌరులే కాదు, ఇరు దేశాల మధ్య పోరాడుతున్న సైనికులు కూడా బలి అవుతున్నారు. కాగా, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న ఆరుగురు నేపాలీ పౌరులు మరణించారు. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. దీనితో పాటు నేపాల్ పౌరులను తమ సైన్యంలో చేర్చుకోవద్దని ప్రభుత్వం రష్యాను అభ్యర్థించింది.
నేపాల్ ప్రభుత్వం ఏం చెప్పింది?
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న ఆరుగురు నేపాల్ పౌరులు మరణించారని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మృతులను స్యాంగ్జాకు చెందిన ప్రీతమ్ కర్కీ, ఇలమ్‌కు చెందిన గంగా రాజ్ మోక్తాన్, డోలాఖాకు చెందిన రాజ్ కుమార్ కర్కీ, కపిల్వాస్తుకు చెందిన రూపక్ కర్కీ, కస్కీకి చెందిన దివాన్ రాయ్, గూర్ఖాకు చెందిన సందీప్ తపలియాగా గుర్తించారు. యుద్ధంలో మరణించిన నేపాల్ మృతదేహాలను స్వదేశానికి రప్పించాలని, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రష్యాను మంత్రిత్వ శాఖ అభ్యర్థించినట్లు ప్రకటన పేర్కొంది. నేపాల్ తన పౌరులను రష్యన్ సైన్యంలోకి చేర్చుకోవద్దని రష్యాను అభ్యర్థించింది. ఎవరైనా నేపాలీ పౌరులు రిక్రూట్ చేయబడి ఉంటే వెంటనే వారిని స్వదేశానికి పంపాలని కోరింది.
Read Also:Tiger Attack: ఆవుపై దాడి చేసింది చిరుత కాదు హైనా.. తేల్చేసిన అటవీశాఖ అధికారులు
నేపాలీ బందీని విడిపించే ప్రయత్నం
రష్యా సైన్యం కోసం పోరాడుతూ ఉక్రెయిన్ చేతిలో బందీగా ఉన్న నేపాలీ సైనికుడిని విడుదల చేసేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని నేపాల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని ప్రభుత్వం కోరినప్పటికీ ప్రస్తుతం దాదాపు 200 మంది నేపాలీలు రష్యా సైన్యంలో సైనికులుగా పనిచేస్తున్నారని భావిస్తున్నారు. కొంతమంది నేపాల్ యువకులు కూడా ఉక్రేనియన్ సైన్యంలో పనిచేస్తున్నారు కానీ వారి ఖచ్చితమైన సంఖ్య తెలియదు.
నేపాలీ యువకులు రష్యాకు ఎలా చేరుకున్నారు?
ఖాట్మండు పోస్ట్ ప్రకారం.. సోషల్ మీడియాలో అనేక వీడియోలు వెలువడ్డాయి. అందులో నేపాల్ యువత రష్యా, ఉక్రెయిన్ సైన్యంలో పనిచేస్తున్నట్లు చూపబడింది. నేపాలీ యువత ప్రతినెలా రూ.4,00,000 వరకు సంపాదించవచ్చని వీడియోలో పేర్కొన్నారు. వాస్తవానికి, నేపాలీ సైన్యం ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా మాత్రమే భారతీయ, బ్రిటిష్ సైన్యంలో నేపాల్ పౌరుల నియామకాన్ని ఆమోదించింది.
Read Also:Uttarpradesh : సీఎం యోగి కఠిన వైఖరి..యూపీలో అల్లర్లకు ఫుల్ స్టాప్
