Site icon NTV Telugu

Nepal in Turmoil: సోషల్‌ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్‌ను తగులబెట్టారు..! నేపాల్‌లో ముదిరిన హింస..

Nepa6

Nepa6

Nepal in Turmoil: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అలాంటి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది నేపాల్ సర్కార్.. కానీ.. తరువాత జరిగే హింసాత్మక నిరసనల గురించి అంచనా వేయడంలో విఫలమైంది. నిరసనల ధాటికి హిమాలయ దేశం నేపాల్‌ అట్టుడుకుతోంది. సోషల్‌ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఉద్రిక్తతలు ఆగడం లేదు. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ఈ ఘటన తీవ్రతకు సంబంధించిన ఫొటోలు చూద్దాం…

నేపాల్ పార్లమెంట్ నుంచి పొగలు ఎగసిపడుతున్నాయి. నిరసనకారులు పార్లమెంటును ఆక్రమించుకున్నారు.

కేపీ ఓలి కార్యాలయం వద్ద భారీ జనసమూహం. నినాదాలు చేస్తూ నిరసన..

ప్రధాని కార్యాలయంలోకి ప్రవేశించిన నిరసనకారులు.. పార్లమెంట్ ఆవరణలో భారీ జనసమూహం..

కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం వద్ద ఎగిసిపడుతున్న మంటలు.. అధికార పార్టీ నాయకుడి హిల్టన్ హోటల్‌లో అలుముకున్న పొగలు..

ఖాట్మండులోని నేపాలీ కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పంటించిన నిరసనకారులు..

నిరసనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా బలగాలు..

Exit mobile version