Nepal Protests 2025: పొరుగు దేశం నేపాల్‌లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. వేలాది నేపాలీలు ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ దేశ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చారు. నేపాల్ ప్రభుత్వం శుక్రవారం నుంచి దేశంలో అనేక సోషల్ మీడియా సైట్‌లను నిలిపి వేసింది. ప్రభుత్వ చర్యతో దేశంలోని ప్రజలు, కోపం, గందరగోళానికి గురయ్యారు. నేపాల్‌లో మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రసిద్ధమైన ప్లాట్‌ఫామ్‌లపై వినోదం, వార్తలు, వ్యాపారం కోసం ఆధారపడుతున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం వాటిని అర్థాంతరంగా నిలిపివేయడంతో వేలాది మంది ప్రజలు సోమవారం ఖాట్మండులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ఎత్తివేయాలని, దేశంలో ఉన్న అవినీతిని అంతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు.
READ ALSO: IP69 రేటింగ్, 7000mAh బ్యాటరీ, డ్యూరబుల్ ఛాంపియన్ ట్యాగ్‌లైన్‌తో వచ్చేస్తున్న OPPO F31 Series!
ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమనీ, రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కునూ కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఒక్కసారిగా పెల్లుబిక్కిన జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రయోగించిన రబ్బరు బుల్లెట్ల కారణంగా పలువురు వ్యక్తులు గాయపడినట్లు, ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. ఖాట్మండులో, బనేశ్వర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్‌కు రబ్బరు బుల్లెట్ తగిలింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించి పార్లమెంటు సమీపంలోని నిషేధిత మండలాల్లోకి ప్రవేశించడంతో ప్రభుత్వం నేపాల్ రాజధానిలో సైన్యాన్ని మోహరించింది. నిరసనకారులు చెట్ల కొమ్మలు, నీటి సీసాలు విసిరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో పోలీసులు వాటర్ ఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లతో స్పందించారు. కొంతమంది నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి కూడా ప్రవేశించారు.
ఈ అశాంతికి ప్రతిస్పందనగా ఖాట్మండు జిల్లా పరిపాలన కార్యాలయం కర్ఫ్యూను పొడిగించింది. మొదట రాజధాని బనేశ్వర్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. కొత్త ఆంక్షలలో ఇప్పుడు రాష్ట్రపతి నివాసం (శీతల్ నివాస్), లాయించౌర్‌లోని ఉపరాష్ట్రపతి నివాసం, మహారాజ్‌గంజ్, సింఘా దర్బార్ అన్ని వైపులా, బలువతార్‌లోని ప్రధానమంత్రి నివాసం, పరిసర ప్రాంతాలు వంటి అనేక ప్రాంతాలు హై-సెక్యూరిటీ జోన్‌లు ఉన్నాయి.
రిజిస్టర్ కాకపోవడంతో నిలిపివేత..
కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద గడువు లోపల రిజిస్టర్ కానందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్లిన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం గత గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుంచి ఏడురోజుల్లోగా రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ గడువు బుధవారం రాత్రి తీరిపోయినా అవి రిజిస్టర్ కాలేదు. టిక్టాక్, వైబర్, విట్, నింబజ్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది.
READ ALSO: Nivetha Thomas : నివేతా థామస్ ఓనం ఫొటోస్ చూస్తే చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే
