Site icon NTV Telugu

Nepal : నేపాల్ అధ్యక్షురాలికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

Nepal President Bidhya Devi Bhandari Hospitalise

Nepal President Bidhya Devi Bhandari Hospitalise

Nepal : నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను ఆ దేశ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. విద్యదేవి భండారీ శుక్రవారం నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.. శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి తరలించినట్లు తన పర్సనల్ సెక్రెటరీ భేష్ రాజ్ అధికారి తెలిపారు.

Read Also: Diwali: దీపావళి పండుగపై అయోమయం.. ఈ నెల 24న లేదా 25..?

ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు అన్ని ర‌కాల వైద్య ప‌రీక్షలు నిర్వహించారని, రిపోర్టులు రావాల్సి ఉంద‌ని భేష్ రాజ్‌ చెప్పారు. విద్యాదేవి భండారి నేపాల్‌కు మొద‌టి మ‌హిళా అధ్యక్షురాలు. అంతేగాక వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు దేశాధ్యక్ష ప‌ద‌వికి ఎంపికైన వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ఆమె మొద‌టిసారి 2015లో దేశాధ్యక్షురాలు కాగా, 2018లో మ‌రోసారి ఆ ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఆమె ప‌ద‌వీకాలం పూర్తికానుంది.

Read Also:Kidnap: పాకిస్థాన్ సీనియర్ మంత్రి కిడ్నాప్.. విడుదల

నేపాల్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా విద్యాదేవి చరిత్ర సృష్టించారు. ఈమె కమ్యూనిస్టు మహిళ కావడం గమనార్హం. ఇటీవల సొంత లౌకిక రాజ్యాంగాన్ని లిఖించుకున్న నేపాల్ లో మొదటిసారి ఒక మహిళ దేశాధ్యక్ష పదవి చేపట్టారు. అంతకుముందు ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. విద్యాదేవి ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నేత మదన్ భండారీ భార్య. నేపాల్ లో 240ఏళ్ల పాటుసాగిన రాచరికం రద్దయిన తర్వాత 2008 నుంచి దేశాధ్యక్షుడిగా ఉన్న రాంభరణ్ యాదవ్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. 1993లో భర్త మదన్ భండారీ రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.

Exit mobile version