Nepal: పుష్ప కమల్ దహల్ ప్రచండకు పదవీ గండం.. నేపాల్లో కూలనున్న సంకీర్ణ సర్కార్..?
- నేపాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ..
- కొత్త సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన పార్టీలు..
- నేపాల్లో ప్రధాని పదవీని షేర్ చేసుకునేందుకు కుదిరిన ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కఠ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ నాయకత్వంలో ఉన్న సంకీర్ణ సర్కార్ స్థానంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయింది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – యూనిఫైడ్ మార్క్సిస్ట్ – లెనినిస్ట్ (సీపీఎన్-యుఎంఎల్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సోమవారం రాత్రి ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రధాని పదవికీ ప్రచండ రాజీనామా చేయడానికి మంగళవారం కూడా నిరాకరించారు. రాజీనామా చేయడం కంటే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటానని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఆఫీసు బేరర్ల మీటింగ్ లో ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Astrology: జులై 03, బుధవారం దినఫలాలు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అయితే, రాజ్యాంగం ప్రకారం ప్రధాని పార్లమెంట్ విశ్వాసాన్ని పొందడానికి 30 రోజుల సమయం ఉంటుంది. గత ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న పీఎం పుష్ప కమల్ దహల్ ప్రచండ ఇప్పటికే మూడుసార్లు విశ్వాస పరీక్షలో గెలిచారు. ప్రచండ ప్రభుత్వానికి ఇచ్చిన సపోర్టును ఓలి సారథ్యంలోని సీపీఎన్-యుఎంఎల్ నాలుగు నెలల క్రితం మద్దతు ఇవ్వడం కుదరదని చెప్పడంతో ప్రచండ సర్కారు కూలిపోయే పరిస్థితి నెలకొంది. 2024-25 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌పై అసంతృప్తితోనే ఓలి మద్దతు ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఓలి పార్టీ మంత్రులు సైతం రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. ప్రచండ సంకీర్ణం కూలిపోయిన తర్వాత తాము ఏర్పా టుచేసే కొత్త జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని సవరించాలని దేవ్ బా, ఓలి ప్రధానంగా నిర్ణయించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇక, పార్లమెంట్ పదవీకాలంలో మిగిలిన మూడేళ్లకు ఈ రెండు పార్టీలకు చెందిన వాళ్లు రొటేషన్ పద్ధతిపై ప్రధాన మంత్రి పదవిని చేపట్టనున్నారు. 275 సీట్లు గల నేపాల్ పార్లమెంటులో దేవ్ బా నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఓలి పార్టీకి వచ్చిన 78 సీట్లను కలుపుకుంటే మొత్తం 167 సీట్ల మెజారిటీ వస్తుంది. సాధారణ మెజారిటీ 138 సీట్లకంటే ఇది చాలా ఎక్కువే. నేపాల్‌లో గడచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!