Nepal PM: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ గురువారం తెల్లవారుజామున హ్యాక్ చేయబడింది. దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్‌యూఆర్ (BLUR) కనిపించింది. ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం @PM_nepal_ అని ఉంది. అయితే అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించారు. హ్యాకింగ్ విషయంపై పీఎం కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అకౌంట్‌కు 690.1K ఫాలోవర్స్ ఉన్నారు.
Read Also: New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ గతేడాది డిసెంబర్‌లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1954 డిసెంబర్ 11న కాక్సీ జిల్లాలోని దికుర్పోఖరి ప్రాంతంలో జన్మించిన దహాల్ గెరిల్లా ఉద్యమ నేతగా ప్రాచుర్యంలోకి వచ్చారు. సీపీఎన్ – మావోయిస్టు పార్టీ శాంతియుత రాజకీయాలు ప్రారంభించిన అనంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.