Site icon NTV Telugu

NEP vs WI: ఛీ.. ఛీ.. అసలు ఎలా గెలిచారో రెండు సార్లు ప్రపంచ కప్.. పసికూన చేతిలో వరుసగా రెండో పరాజయం

Cricket

Cricket

NEP vs WI: వెస్టిండీస్.. ఒకప్పుడు ఈ జట్టు పేరు చెబుతూనే మిగితా జట్ల ఆటగాళ్లు భయంతో భయపడే వాళ్లు. అలాంటి జట్టు ఇప్పుడు దారుణ స్థితిలో ఆడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇదివరకు షార్జాలో జరిగిన మొదటి టీ20లో నేపాల్, వెస్టిండీస్‌పై సంచలన విజయం సాధించింది. ఒకసారి ఇలా జరుగుతే ఏమో అనుకోవచ్చు. కానీ, మళ్ళీ అదే రిపీట్ అయితే.. అవునండి బాబు పసికూన నేపాల్ వెస్టిండీస్ పై మరోసారి భారీ విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..

JC Prabhakar Reddy: హౌస్‌ వైఫ్ అంటే అంత సులభమైన పని కాదు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

షార్జాలో జరిగిన రెండవ T20I మ్యాచ్‌లో నేపాల్, వెస్టిండీస్‌పై 90 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (Aasif Sheikh) 47 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి అద్భుతమైన ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసిఫ్ షేక్ (68 నాటౌట్)తో పాటు కుశాల్ భుర్తేల్ (24) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో అకేల్ హోసెన్ (Akeal Hosein) 2 వికెట్లు తీసుకోగా, కైల్ మేయర్స్ (Kyle Mayers) కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.

Mammootty: మమ్ముట్టి హెల్త్ అప్‌డేట్..

ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ నిలకడగా రాణించలేకపోయింది. కేవలం 17.1 ఓవర్లలోనే 83 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లలో అమీర్ జంగూ (Amir Jangoo) 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో మహ్మద్ ఆదిల్ ఆలం (Mohammad Aadil Alam) 4 వికెట్లు, కుశాల్ భుర్తేల్ (Kushal Bhurtel) 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో నేపాల్ సిరీస్‌లో తమ ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది.

Exit mobile version