Site icon NTV Telugu

Nepal: పని కోసం రష్యా- ఉక్రెయిన్ కు వెళ్లొద్దు..

Nepal

Nepal

తమ ప్రజలు పని కోసం ఉక్రెయిన్- రష్యా దేశాలకు వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగాల కోసం వెళ్తున్న చాలా మంది రష్యా ఆర్మీలో చేర్చుకున్నారని నేపాల్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. రష్యా సైన్యం తరపున పోరాడుతూ నేపాలీ మూలానికి చెందిన చాలా మంది వ్యక్తులు మరణించినట్లు నేపాలీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. దీంతో నేపాల్ ప్రభుత్వం ఆ రెండు దేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు విధించింది.

Read Also: Tata Punch EV: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్స్ షురూ..

అయితే, దాదాపు నలుగురు నేపాల్‌కు చెందిన వ్యక్తులను ఉక్రెయిన్ సైన్యం పట్టుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. యుద్ధంలో కనీసం 10 మంది నేపాలీ ప్రజలు మరణించినట్లు పలు నివేదికలు వెల్లడైంది. నేపాల్ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు పని కోసం రష్యా- ఉక్రెయిన్ దేశాలకు వెళ్తున్నారు.. ఇందు కోసం వీరంతా నేపాల్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. కొత్త నిబంధనల తర్వాత నేపాలీ ప్రజలు పని కోసం రష్యాతో పాటు ఉక్రెయిన్‌లకు వెళ్లలేరు.. ఇందుకు అవసరమైన పర్మిషన్ లను ప్రభుత్వం వారికి ఇవ్వలేదు అని తెలుస్తుంది.

Read Also: Balineni Srinivasa Reddy: రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్‌తోనే.. టీడీపీతో టచ్‌లో లేను..!

ఇక, నేపాలీ ప్రజలు రష్యా వైపు పోరాడుతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కొందరు నేపాలీ ప్రజలు కూడా కిరాయి సైనికులుగా ఉక్రెయిన్ తరపున పోరాడుతున్నారని కొన్ని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గొన వారి సంఖ్య తెలియరాలేదు.. వారు ఉక్రెయిన్ సైన్యంతో ఎలా పరిచయం చేసుకున్నారు.. వారి ప్రస్తుత పరిస్థితి, వారు సజీవంగా ఉన్నారా లేదా అనే వివరాలు ఇంకా తెలియలేదు అని నేపాల్ సర్కార్ పేర్కొనింది. నేపాల్ పౌరులకు సంబంధించిన వివరాలను రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో యుద్ధం జరుగుతున్న ఏ దేశానికి నేపాల్ పౌరులు వెళ్లొద్దని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.

Exit mobile version