NTV Telugu Site icon

Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్‌ అరెస్ట్

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.. నిరసనకు అనుమతులు లేకపోవడంతో తాము కార్యక్రమాన్ని అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాగైనా నిరసనను కొనసాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేయడంతో.. ముందు జాగ్రత్తగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

Read Also: AP CM Jagan Tour: నేడు గుంటూరులో సీఎం జగన్‌ పర్యటన.. రేపు కొవ్వూరుకు ముఖ్యమంత్రి

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని మూడేళ్లుగా కోరుతున్నామని.. ముఖ్యమంత్రి స్వయంగా మూడుసార్లు సంతకాలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. తాము విధ్వంసం చేయడం లేదని.. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. పోలీసుల తీరు సరికాదన్నారు. క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం రూ.7 కోట్ల నిధులు అడిగామని ఈ సందర్భంగా చెప్పారు.

 

Show comments