Nellore : ప్రశాంతంగా ఉండే నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణం ఒక్క సారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అధికారులు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హేమంత్ కుమార్ అనే దివ్యాంగుడు టీ పీ గూడురు నివాసి. అతడు శ్రీచైతన్య కాలేజీ రామలింగాపురం బ్రాంచ్ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు, నాలుగున్నర సంవత్సరాలనుంచి ఉద్యోగం చేస్తున్నా జీతం సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను కళాశాల డీన్ శ్రీధర్ మానసికంగా హింసిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో తట్టుకోలేక హేమంత్ కుమార్ కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హేమంత్ కుమార్ ను అడ్డున్నారు. వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం గుంటూరు జనరల్ ఆసుపత్రి(GGH) కి తరలించారు.
Read Also: Health : స్క్రీన్లు చూసి కళ్లు మసకబారుతున్నాయా.. అయితే ఇవి తినండి
గతంలో కూడా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఓ వ్యక్తి బ్లేడుతో మణికట్టుకోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. వంశీకృష్ణ అనే యువకుడి అమ్మ, నాన్న..రఘురాం, రాజేశ్వరి గతంలో తహశీల్దార్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇటీవల తన తల్లి కలెక్టరేట్ కు వచ్చినప్పుడు ఆమెను ఎవరో అవమానించారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు. తన తల్లికి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తనను జయభారత్ ఆస్పత్రుకి తరలించారు.
Read Also: Bhatti Vikramarka: మత కల్లోలం సృష్టించేందుకే బీజేపీ కుట్రలు