NTV Telugu Site icon

NEET : నీట్ వివాదం పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

New Project (43)

New Project (43)

NEET : నీట్ 2024 ఫలితాలపై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. లక్నోకు చెందిన విద్యార్థిని ఆయుషి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు పరీక్ష నిర్వాహణలో గల లోపాలపై ఫిర్యాదు చేశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. ఈ పరీక్ష నిర్వహించే ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ (ఎన్‌టీఏ)పై విద్యార్థుల ఆగ్రహం రోజు రోజుకు పెరుగుతోంది. జేఎన్‎యూ విద్యార్థి సంస్థ ఏఐఎస్ఏ సోమవారం ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించింది. యూపీలోని ఔరయ్యా, రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూడా భారీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

జూన్ 4న విడుదలైన ఫలితాల్లో మెరిట్ సాధించిన చాలా మంది విద్యార్థులు సంబరాలు చేసుకుంటుండగా, చాలా మంది విద్యార్థులు మోసపోయారని భావిస్తున్నారు. ఎన్‌టీఏ నుండి తనకు అందిన ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని లక్నోకు చెందిన ఆయుషి పటేల్ ఆరోపించారు. అంతకుముందు ఆమె ఎన్‌టీఏ సైట్‌లో తన ఫలితాలను చూడలేకపోయారు. తనకు పెద్ద మోసం జరిగిందని భావిస్తున్నారు. రిజల్ట్ వచ్చిన రోజున వెబ్ సైట్లో తన ఫలితం కనిపించలేదని.. గంట తర్వాత ఎన్టీఏ నుంచి మెయిల్ వచ్చిందని, మీ ఓఎంఆర్ షీట్ గుర్తించలేనంతగా చిరిగిపోయి పాడైపోయిందని అందుకే ఫలితం రాలేదని చెప్పారు.

Read Also:RT75 Launched: ధమాకా జోడి రిపీట్.. రవితేజ, శ్రీలీల కొత్త సినిమా ఆరంభం!

నీట్ విద్యార్థిని ఆయుషి పటేల్ తనకు అందిన ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని పేర్కొంది. ఎన్టీఏకు ఆయుషి దాదాపు 20 ట్వీట్లు చేశారు. 20వ ట్వీట్‌లో ఆయుషి వైరల్ వీడియోలో చేస్తున్న దావా పూర్తిగా తప్పు అని ఎన్‌టీఏ ఆయుషికి సమాధానంగా రాసింది. చిరిగిన ఓఎంఆర్ షీట్ పంపలేదు.

నీట్ ఫలితాల వివాదానికి కారణం?
నీట్ పరీక్ష, ఫలితాలు ఎందుకు ప్రశ్నార్థకంగా ఉన్నాయో ఇప్పుడు అర్థమైందా? ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఆరోపించారు. చాలా మంది విద్యార్థుల ఫలితాలు ఆన్‌లైన్‌లో ప్రకటించలేదు. చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు, అంటే ఓఎంఆర్ షీట్ ప్రకారం రావాల్సిన మార్కులు రాలేదు. ఎందుకు ఇలా జరిగిందనేది ప్రశ్న ? ఈసారి నీట్ ఫలితాల్లో మొత్తం 67 మంది టాపర్లుగా నిలిచారు. ఇలా చరిత్రలో మొదటిసారి జరిగింది. ఒకే సెంటర్ నుంచి ఆరుగురు టాపర్లు ఎలా వస్తారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు 718, 719 మార్కులు కూడా పొందారు, ఇది అసాధ్యం, కావున బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపాలని కోరుతున్నారు.

Read Also:Chandrababu Swearing In: రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!