NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Aspirant Suicide: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ విజయ్‌నగర్ పరిధిలో గుండెల్ని పిండేసే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న జతిన్ కుమార్ అనే 22 ఏళ్ల విద్యార్థి మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. జతిన్ తన తల్లిదండ్రులకు ఉన్న ఒకే ఒక్క కుమారుడు. కాగా, అతని తండ్రి రాజేష్ కుమార్ సహారన్పూర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న జతిన్‌కు 2026 మే నెలలో జరిగిన నీట్ పరీక్ష ఐదో ప్రయత్నం. ఆ పరీక్ష ముగిసినప్పటికీ, మళ్లీ జరగబోయే నీట్ పరీక్ష కోసం అతను విజయ్‌నగర్ సెక్టార్-9లోని తన గదిలో ఉంటూ తిరిగి ప్రిపరేషన్ సాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని నిద్ర లేపడానికి గదిలోకి వెళ్లేసరికి జతిన్ నిర్జీవంగా ఫ్లోర్‌పై పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. ఉరివేసుకున్న సమయంలో ఫ్యాన్‌కు కట్టిన తాడు తెగిపోవడంతో మృతదేహం కింద పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సిటీ కొత్వాలీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఉపాసన పాండే, విజయ్‌నగర్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ దర్యాప్తులో జతిన్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతను రికార్డ్ చేసిన ఒక నిమిషం ఐదు సెకన్ల నిడివి గల భావోద్వేగ భరిత వీడియో లభ్యమైంది. ఆ వీడియోలో ఫ్యాన్‌కు వేసిన ఉరితాడును చూపిస్తూ.. “నాన్నగారేమో అస్సలు టెన్షన్ పడొద్దని చెబుతున్నారు, నిజానికి నాకు కూడా ఎలాంటి టెన్షన్ లేదు. కానీ, వీటన్నింటి వల్ల నా మనసు పూర్తిగా విసిగిపోయింది. నేను జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నాను” అంటూ జతిన్ తన చివరి మాటలను రికార్డ్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడటానికి నిరాకరించారు.
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!