Site icon NTV Telugu

Neeraj Mittal: ఈ ఏడాది చివరికల్లా 5జీ నెట్వర్క్ అమలు చేస్తాం..

5g

5g

భారతదేశ టెలికాం సంస్థలో టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించిందని భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్ అన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారతదేశంలోని అనేక ప్రముఖ పరిశోధన విద్య సంస్థలో భారతీయ టెలికాం సంస్థలోని అబ్రిడేషన్ పైన పరిశోధనలు జరుగుతున్నాయని.. పరిశోధనలు చేసే సంస్థలకు కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చామని ఆయన తెలిపారు.

Read Also: Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు.. రేపు అసెంబ్లీలో బల నిరూపణ

పరిశోధనలు ఏ విధంగా సాగుతున్నాయి అనే దాని పైన హైదరాబాద్ లోని త్రిబుల్ ఐటీ, సంగారెడ్డిలోని ఐఐటీలను ఆయన సందర్శించారు. టెలికాం సంస్థ టెలికాం అబ్రిడేషన్ పైన జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలో టెలికాం రంగంలో 5జీ నెట్ వర్క్ ను దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి యొక్క ప్రతిభను టెలికాం రంగం విరివిరిగా వినియోగించుకోనున్నదని.. అందులో భాగంగానే టెలికాం రంగంలోని 5జీ అబ్రిడేషన్ పైన పరిశోధనలు చేయుటకు ఇంజనీరింగ్ కాలేజీలకు అవకాశం కల్పిస్తున్నామని సెక్రటరీ చెప్పారు. 26 వేల కోట్ల రూపాయలను టెలికాం రంగంలో టెక్నాలజీ అప్ గ్రేడింగ్ కోసం ఖర్చు చేస్తున్నామని భారతదేశ టెలికాం సంస్థ సెక్రటరీ నీరజ్ మిట్టల్ తెలిపారు.

Read Also: BIG Shock: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేయనున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే..

Exit mobile version