Site icon NTV Telugu

Neeraj Chopra Wife: రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్‌ను వదులుకున్న నీరజ్ సతీమణి.. ఎందుకో తెలుసా?

Himani Mor

Himani Mor

Neeraj Chopra Wife Himani Mor Quits Tennis and Job: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్ చోప్రా ఈఏడాది ఆరంభంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన స్నేహితురాలు హిమానీ మోర్‌ని 2025 జనవరి 16న సిమ్లాలో వివాహం చేసుకున్నాడు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్-హిమానీ పెళ్లి జరిగింది. ప్రస్తుతం నీరజ్ చోప్రా యూరప్‌లో శిక్షణ పొందుతున్నాడు. నీరజ్‌తో పాటే హిమానీ కూడా అక్కడే ఉన్నారు. అయితే హిమానీ రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్‌ను వదులుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె తండ్రి స్వయంగా చెప్పారు.

హిమానీ మోర్‌ తండ్రి చాంద్ మోర్ దైనిక్ భాస్కర్‌తో మాట్లాడుతూ… ‘నీరజ్‌ చోప్రాతో పెళ్లి తర్వాత హిమానీ తన టెన్నిస్‌ కెరీర్‌కు వీడ్కోలు చెప్పింది. అమెరికాలో రూ.1.5 కోట్ల క్రీడలకు సంబంధించిన ఉద్యోగ ఆఫర్‌ను కూడా తిరస్కరించింది. హిమానీ ఇప్పుడు తన సొంత వ్యాపారంపై దృష్టి సారించింది. తప్పకుండా సక్సెస్ అవుతుంది’ అని చెప్పారు. ప్రస్తుతం నీరజ్ శిక్షణా, డైట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, క్రీడా ఈవెంట్స్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యూరప్‌లో ఉన్న హిమానీ.. త్వరలోనే తన సొంత వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

హర్యానాలోని లార్సౌలీలో 1999లో జన్మించిన హిమానీ మోర్‌ నాలుగో తరగతి చదువుతున్నప్పుడు టెన్నిస్ ఆడటం ప్రారంభించారు. అయితే కుటుంబం మాత్రం బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీపై దృష్టి పెట్టాలని సూచించింది. హిమానీ మాత్రం టెన్నిస్ ఆడుతానని స్పేటం చేశారు. ఓవైపు టెన్నిస్ ఆడుతూ.. మరోవైపు చదువు కొనసాగించారు. సోనిపట్‌లో స్కూల్ విద్య పూర్తి చేసి.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ఫిజికల్‌ సైన్స్‌లో పట్టా అందుకున్నారు. 2018లో హిమానీ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అరంగేట్రం చేశారు. అదే ఏడాది కెరీర్‌లో ఉత్తమంగా సింగిల్స్‌ విభాగంలో 42వ, డబుల్స్‌లో 27వ ర్యాంకు సాధించారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

Also Read: Boy Rape: ఉప్పల్‌లో దారుణం.. 5 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, హత్య!

ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వవిద్యాలయం (న్యూ హాంప్‌షైర్) నంచి స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ అండ్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌లో హిమానీ మోర్‌ డబుల్ ఎంబీఏ చేశారు. అంతేకాదు సౌత్-ఈస్టర్న్ లూసియానా విశ్వవిద్యాలయం నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు. యుఎస్‌లో ఉన్నప్పుడు మహిళా టెన్నిస్ జట్టు మేనేజర్, అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశారు. పెళ్లి అనంతరం అన్ని వదిలేసిన హిమానీ.. సొంత వ్యాపారంపై దృష్టి సారించారు.

 

 

Exit mobile version