Site icon NTV Telugu

Neeraj Chopra: గోల్డెన్ బాయ్ ఖాతాలో మరో స్వర్ణ పతకం..

Neeraj Chopra

Neeraj Chopra

Neeraj Chopra: నీరజ్ చోప్రా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత జావెలిన్ చరిత్రను తిరగరాసిన అతను, అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. 2022 వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిశాడు. అలాగే పారిస్ ఒలింపిక్స్ 2024 ఒలింపిక్స్ లో వెండి పతకంతో పట్టు ఆ తర్వాత జరిగిన అనేక లీగ్ లలో అనేక మెడల్స్ సాధించాడు.

Read Also:Best Family Cars: మీ కుటుంబ భద్రత కోసం అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ గల కార్స్ లిస్ట్ ఇదే..!

ఇక ఈ భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. బెంగళూరులోని శ్రీ కంఠీర్వ స్టేడియం వేదికగా తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ పోటీలో నీరజ్ అద్భుతంగా రాణించాడు. మూడవ రౌండ్‌లో 86.18 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన అతను, ఈ ఈవెంట్‌ను విజయవంతంగా గెలుచుకున్నాడు. ఈ త్రోను ఎవరూ అధిగమించలేకపోవడంతో నీరజ్ ను విజేతగా ప్రకటించారు. ఈ పోటీలో కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 మీటర్లతో రెండవ స్థానంలో, శ్రీలంక అథ్లెట్ రమేష్ పతిరాజ్ 84.34 మీటర్ల త్రోతో మూడవ స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన సచిన్ యాదవ్ నాల్గవ స్థానంతో సర్దుకున్నాడు.

Read Also:Motorola Edge 50 Fusion vs Vivo Y39 5G: మిడ్ రేంజ్‌లో బెస్ట్ ఫోన్ ఏది..? ఎందుకు..?

ఈ స్పోర్టింగ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి 15 వేల మందికి పైగా ప్రేక్షకులు గ్రౌండ్ కు హాజరయ్యారు. గెలిచిన అనంతరం అభిమానులను నీరజ్ కలిశారు. ఇక పోటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్కడ గాలి దిశ త్రోకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఎక్కువ దూరం వెళ్లలేకపోయానని వెల్లడించాడు. అయినప్పటికీ, భారతదేశంలో ఇటువంటి భారీ స్థాయి ఈవెంట్‌లో పాల్గొనడం తనకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీలను దేశంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ పోటీలో మొత్తం 12 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారతదేశం నుంచి ఐదుగురు పాల్గొనగా.. కెన్యా, శ్రీలంక, బ్రెజిల్, అమెరికా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, పోలాండ్‌ల నుంచి ఆటగాళ్లు పాల్గొన్నారు. మొదటి మూడు రౌండ్లలో అందరికీ త్రోలు అవకాశమిస్తే, ఆ తరువాత టాప్ ఎనిమిది మంది తదుపరి రౌండ్లకు అర్హులయ్యారు. గరిష్ట దూరం విసిరిన అథ్లెట్‌కే విజేత స్థానం లభించింది. ఈ పోటీలో ఆసియా క్రీడల పతక విజేత కిషోర్ జెనా, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ గాయాల కారణంగా పాల్గొనలేకపోయారు. అయినప్పటికీ, ఈ పోటీని భారతదేశంలో నిర్వహించడమే ఒక మైలురాయిగా నిలిచింది. నీరజ్ చోప్రా చేసిన ఈ ప్రయత్నం భారత అథ్లెటిక్స్‌ కు మరింత ఊపునిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Exit mobile version