Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Neeraj Chopra Mother Says Gold Medal Winner Arshad Nadeem Is Also My Child

Neeraj Chopra Mother: గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డే: నీరజ్‌ చోప్రా తల్లి

Published Date :August 9, 2024 , 8:05 am
By Sampath Kumar
  • సిల్వర్‌ మెడల్‌ను సాధించిన నీరజ్
  • హర్యానాలో సంబరాలు
  • ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా
Neeraj Chopra Mother: గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డే: నీరజ్‌ చోప్రా తల్లి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iam happy with Silver Medal in Paris Olympics 2024 Says Neeraj Chopra Mother: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరాడు. భారత స్టార్ జావెలిన్‌ త్రో ప్లేయర్ నీరజ్‌ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వర్‌ మెడల్‌ను సాధించాడు. నీరజ్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. నీరజ్‌ కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని పండగ చేసుకున్నారు. నీరజ్‌ తల్లి సరోజ్‌ దేవి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు.

బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కూడా తన కుమారుడి లాంటివాడే అని నీరజ్‌ చోప్రా తల్లి సరోజ్‌ దేవి పేర్కొన్నారు. ‘నా కుమారుడు నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గోల్డ్‌ మెడల్‌ కంటే కూడా ఎంతో విలువైంది. బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డ లాంటివాడే. నీరజ్‌ ప్రదర్శనపట్ల గర్వంగా ఉంది. ఇంటికి వచ్చాక అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా’ అని సరోజ్‌ దేవి చెప్పుకొచ్చారు.

Also Read: Neeraj Chopra: నీరజ్‌ చోప్రా భారత్‌ను గర్వించేలా చేశాడు.. ప్రధాని మోడీ ప్రశంసలు!

నీరజ్‌ చోప్రా తండ్రి సతీశ్ మాట్లాడుతూ… ‘నీరజ్‌ దేశం కోసం సిల్వర్‌ మెడల్ గెలిచాడు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతో గర్వంగా భావిస్తున్నాం. నీరజ్‌ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. గాయం తీవ్రత కూడా అతడి ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపించి ఉండొచ్చు. గాయం లేకపోతే మెరుగైన ప్రదర్శన చేసేవాడు’ అని చెప్పారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ముందు గాయం కారణంగా నీరజ్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీవ్రంగా శ్రమించి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు.

Neeraj Chopra’s mother says “ I am happy with the silver, the guy who got gold ( Arshad Nadeem) is also my child, everyone goes there after doing a lot of hard work”

what grace from Neeraj Chopra’s mother, something that people can learn a lot from ♥️

Most beautiful video on… pic.twitter.com/Uqz3LQZCv7

— Roshan Rai (@RoshanKrRaii) August 8, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • neeraj chopra
  • Neeraj Chopra Father
  • Neeraj Chopra javelin
  • Neeraj Chopra Mother
  • Neeraj Chopra Olympics

తాజావార్తలు

  • Harish Rao: ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతోంది.. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

  • Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

  • Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?

  • IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..

  • Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions