NTV Telugu Site icon

Paris Olympics: నీరజ్‌ చోప్రా వీరాభిమాని.. రెండేళ్లలో సైకిల్‌పై 30 దేశాలు దాటి పారిస్‌ కు

Paris Olympics

Paris Olympics

దాదాపు రెండేళ్లుగా సైకిల్ పై కేరళ నుంచి ఫ్రాన్స్ రాజధానికి చేరుకున్నాడు ఓ అభిమాని. భారత స్టార్ అథ్లెట్, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్ చోప్రాకు ఈ యువకుడు వీరాభిమాని. ఈయన పేరు ఫైస్ అస్రఫ్ అలీ.. 15 ఆగస్టు 2022న కేరళలోని కాలికట్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 22,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 30 దేశాలు పర్యటించి పారిస్ చేరుకున్నాడు. అలీ ‘శాంతి,ఐక్యత’ సందేశంతో భారతదేశం నుంచి లండన్‌కు సైక్లింగ్ మిషన్‌కు బయలుదేరాడు.

READ MORE: Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్‌ మరో రెండు గేట్లు ఎత్తివేత..

ఈ క్రమంలో 17 దేశాల్లో సైకిల్ తొక్కిన అనంతరం గతేడాది ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం బుడాపెస్ట్ లో ఆగినప్పుడు నీరజ్ అక్కడే ఉంటున్నట్లు తెలిసింది. అలీ కేరళకు చెందిన ప్రముఖ కోచ్‌కి ఫోన్ చేసి భారత జట్టును కలవాలని కోరాడు. అప్పుడే అలీకి నీరజ్‌ను కలిసే అవకాశం వచ్చింది. లండన్ వెళ్తున్నప్పుడు ఒలింపిక్స్ కోసం పారిస్ ఎందుకు రాకూడదని నీరజ్.. అలీని అడిగాడు. ప్లేయస్ ఆహ్వానం మేరకు అలీ తన ప్లాన్‌ని కాస్త మార్చుకుని పారిస్ వెళ్లేందుకు అవసరమైన వీసా సంపాదించాడు.

READ MORE: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

నీరజ్‌ని పారిస్‌కు ఆహ్వానించారు..
‘ఇండియా హౌస్’లో తన పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఫైస్ అస్రఫ్ అలీ మాట్లాడుతూ.. “భారత అథ్లెట్లతో మాట్లాడటానికి నాకు కొన్ని నిమిషాలు సమయం దొరికింది. పారిస్‌ ఒలింపిక్స్ కి రామ్మని నీరజ్ నన్ను ఆహ్వానించాడు. ఆయన్ను మళ్లీ పారిస్‌లో కలవడం గొప్ప అవకాశంగా భావించాను. కాబట్టి నేను నా ప్రణాళికలను కొంచెం మార్చుకున్నాను. అవసరమైన వీసాను పొందాను. అతను మళ్లీ చరిత్ర సృష్టించడం చూడటానికి నేను వచ్చాను. ” అని పేర్కొన్నాడు.

READ MORE: Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..

అలీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ ఏ హోటల్‌లోనూ ఉండను. మధ్యమధ్యలో వీసా ఏర్పాటు చేసుకోవడానికి రెండు సార్లు కేరళ వెళ్లాల్సి వచ్చింది. సరిహద్దు దాటడానికి మాకు వీసా మాత్రమే అవసరం. సైక్లిస్ట్‌కు ఇతర పత్రాలు ఏవీ అవసరం లేదు.’ అని తెలిపాడు. ఈ కాలంలో అలసట లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యను ఎదుర్కొన్నారా అని అలీని అడిగినప్పుడు.. అలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదని చెప్పాడు.

Show comments