Site icon NTV Telugu

Karthi: ‘నీలకంఠ’ మూవీ ఘన విజయం సాధించాలి: హీరో కార్తీ

Neelakantha

Neelakantha

Karthi: బాలనటుడిగా పలు హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్ నటిస్తున్న కొత్త సినిమా ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్న ముతులూరి, నేహా పఠాన్, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు.

READ ALSO: Bandi Sanjay :”బోయపాటి తాండవం.. బాలయ్య విశ్వరూపం.. సనాతన ధర్మ రక్షణకు ‘అఖండ 2’ దిక్సూచి!”

‘నీలకంఠ’ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే డ్రామా. కర్మ సారాంశాన్ని తెలిపే కథాంశంతో రూపొందింది. తాజాగా ఈ చిత్ర బృందానికి హీరో కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ‘‘మాస్టర్ మహేంద్రన్, ‘నీలకంఠ’ టీమ్‌కు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. చేయని తప్పుకు నింద మోపబడిన హీరో దానిని ఎలా ఎదుర్కొన్నాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? అనే కథాంశంతో, ఈ సినిమా ఆకట్టుకునేలా తెరకెక్కినట్లు తెలిపారు. మంచి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఉంటాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని దర్శకుడు రాకేష్ మాధవన్ ధీమా వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. 2026 జనవరి 2న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

READ ALSO: Jagapathi Babu: జిత్తు టు అప్పలసూరి: జగ్గుభాయ్ విశ్వరూపం చూపిన రోల్స్ ఇవే

Exit mobile version