CP Radhakrishnan: ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఫిక్స్ అయినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత నడ్డా రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1957 మే 4న జన్మించిన ఆయన, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించారు. గతంలో ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరుఫున రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
READ MORE: APSRTC: స్త్రీశక్తి పథకం ఎఫెక్ట్.. ఉద్యోగుల భత్యాల పెంపు!
సిపి రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానం..
చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (CP రాధాకృష్ణన్) 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్‌లతో ప్రారంభించారు. ఆయన జూలై 31, 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (అదనపు బాధ్యత)గా పని చేశారు. 2003 నుంచి 2006 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు భాజపా సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాదివాసి, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన సీపీ రాధాకృష్ణన్ ఎంపిక చేయడంతో బీజేపీ సమతుల్యత పాటించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ MORE: Brooklyn Shooting: కాల్పులతో దద్దరిల్లిన న్యూయార్క్.. స్పాట్‌లో ముగ్గురు మృతి
