Bihar Seat-Sharing: ఎన్డీఏలో సీట్లు ఖరారు.. బీజేపీ, జేడీయూకు ఎన్నెన్ని సీట్లంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమిలో ఉన్న బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు ఖరారైనట్లు జేడీయూ వెల్లడించింది. బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం ఎక్కువగా లభించింది. బీజేపీకి 17, జేడీయూకి 16, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 5 సీట్లు లభించాయి. ఈ సీట్ల ఖరారులో హోంమంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు.
BJP: పోటీ చేసే స్థానాలు ఇవే: పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, ఔరంగాబాద్, మధుబని, అరారియా, దర్భంగా, ముజఫర్‌పూర్, మహారాజ్‌గంజ్, సరన్, ఉజియార్పూర్, బెగుసరాయ్, నవాడా, పాట్నా సాహిబ్, పాట్లీపుత్ర, అర్రా, బక్సర్, ససారాం నుంచి బీజేపీ పోటీ చేస్తుంది.
JDU: పోటీ చేస్తున్న స్థానాలు ఇవే: వాల్మీకి నగర్, సీతామర్హి, ఝంజర్పూర్, సుపోల్, కిషన్గజ్, కతియార్, పూర్నియా, మాధేపురా, గోపాల్‌గంజ్, శివన్, భాగల్పూర్, బంకా, ముంగేర్, నలంద, జహనాబాద్, సియోహర్.
LJP: పోటీ చేస్తున్న స్థానాలు ఇవే: వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ఇక ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో చేరిన రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీలు ఒక్కొక్క స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కరాకర్ నుంచి RLM, గయా నుంచి HAM బరిలోకి దిగుతున్నాయి. ఇలా మొత్తం 40 స్థానాలకు ఎన్డీఏలో సీట్లు సర్దుబాటు పూర్తయింది. ఇక బీహార్‌లో ఇండియా కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఆర్జేడీ మిగతా స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత శనివారమే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ఏడు విడతల్లో పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!