NTV Telugu Site icon

NCERT: ఒప్పంద ప్రాతిపదికన 90 పోస్టుల భర్తీ.. భారీగా జీతం..

Ncert Ntv

Ncert Ntv

NCERT : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( NCERT) ఢిల్లీలో ఒప్పంద ప్రాతిపదికన స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. అసిస్టెంట్ ఎడిటర్స్, ప్రూఫ్ రీడర్స్, DTP ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అసిస్టెంట్ ఎడిటర్‌లు, ప్రూఫ్ రీడర్‌ల కోసం రిజిస్ట్రేషన్ & డాక్యుమెంట్ స్క్రీనింగ్ 22 జూలై 2024న జరుగుతుంది. అయితే., DTP ఆపరేటర్ల కోసం 23 జూలై 2024న జరుగుతుంది. స్కిల్ టెస్ట్లు అసిస్టెంట్ ఎడిటర్‌ల కోసం జూలై 24, 2024న, ప్రూఫ్ రీడర్‌ల కోసం 25 జూలై 2024న షెడ్యూల్ చేసారు. అలాగే DTP ఆపరేటర్‌ల కోసం 27, 28 జూలై 2024 న షెడ్యూల్ చేసారు.

Nani- Janhvi Kapoor: వామ్మో జాన్వీ మా హీరో పక్కన వద్దు బాబోయ్!

ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా 45 (ఇంగ్లీష్ 24, హిందీ 19, ఉర్దూ 2), ప్రూఫ్ రీడర్ గా 17 (ఇంగ్లీష్ 8, హిందీ 6, ఉర్దూ 3), DTP ఆపరేటర్ గా 28 (ఇంగ్లీష్/హిందీ 21, ఉర్దూ 7) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక విద్యార్హత వివరాలు విషయానికి వస్తే.. అసిస్టెంట్ ఎడిటర్ కు బ్యాచిలర్ డిగ్రీ, బుక్ పబ్లిషింగ్/మాస్ కమ్యూనికేషన్/జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎడిటింగ్‌లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రూఫ్ రీడర్ కోసం ఇంగ్లీష్/హిందీ/ఉర్దూలో బ్యాచిలర్ డిగ్రీ, ప్రూఫ్ రీడింగ్‌లో 1 సంవత్సరం అనుభవం, కంప్యూటర్‌లో పని పరిజ్ఞానం ఉండాలి. DTP ఆపరేటర్ కోసం ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, డిటిపిలో ఒక సంవత్సరం డిప్లొమా / సర్టిఫికేట్, ప్రచురణలో 3 సంవత్సరాల అనుభవం, సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

Pre Launch Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం.. రూ.120 కోట్లకు కుచ్చుటోపీ

ఇక ఈ ఉధ్యాలకు జీతాల విషయానికి వస్తే.. అసిస్టెంట్ ఎడిటర్ కు రూ. 80,000/- నెలకు, ప్రూఫ్ రీడర్ కు రూ. 37,000/- నెలకు, DTP ఆపరేటర్ కు రూ. 50,000/- నెలకు ఇస్తారు. మరిన్ని వివరాలకు http://www.ncert.nic.in/ ను సందర్శించవచ్చు.