Site icon NTV Telugu

NCERT partition textbook: వార్తలకెక్కిన ఎన్‌సీఈఆర్‌టీ… దేశ విభజనకు వీళ్లే కారణం అంటూ కొత్త పాఠం..

3

3

NCERT partition textbook: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కొత్తగా ఎన్‌సీఈఆర్‌టీ విద్యార్థుల కోసం దేశ విభజన సమయంలోని భయానక పరిస్థితులను వివరిస్తూ ప్రత్యేక మాడ్యుల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో దేశ విభజనకు ఒక వ్యక్తి కారణం కాదని, ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉందని పేర్కొంది.

READ MORE: Nagarkurnool: ఆన్లైన్ బెట్టింగ్కు బలైన మరో యువకుడు బలి!

ఒక్కరు కాదు.. ముగ్గురు కారణం
దేశ విభజనకు ముస్లిం లీగ్ అగ్రనాయకుడు జిన్నా, మౌంట్‌బాటన్‌లతో పాటు కాంగ్రెస్‌ను కూడా విభజనకు కారణమని తెలిపింది. విభజన బాధను మరచిపోలేమని పుస్తకంలో పేర్కొంది. ఈ పుస్తకంలో దేశ విభజనకు నెహ్రూ కారణమని తెలిపింది. ప్రస్తుతం ఈ పుస్తకం NCERT అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. త్వరలో దీనిని ముద్రించి పాఠశాలల్లో పంపిణీ చేయనున్నారు. ఈ పుస్తకాన్ని 6 నుంచి 8వ తరగతి సాంఘిక శాస్త్రంతో కలుపనున్నట్లు సమాచారం. పుస్తకంలో ముగ్గురు వ్యక్తుల చిత్రం ఉంది. ఆ ఫోటోలో నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నా, లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నారు. ఈ బుక్‌లో జిన్నా పాకిస్థాన్ ఏర్పాటు గురించి మాట్లాడారని చెప్పారు. జిన్నా డిమాండ్‌కు కాంగ్రెస్ తలొగ్గిందని, మౌంట్ బాటన్ దేశ విభజన ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.

పుస్తకంలో ప్రధాని మోదీ కోట్..
NCERT రెండు ప్రత్యేక మాడ్యూల్స్‌లో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. రెండు మాడ్యూల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2021లో ‘విభజన గాయాల స్మారక దినం’ జరుపుకుంటున్నట్లు ప్రకటించిన సందేశంతో ప్రారంభమవుతాయి. విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన ఒక కోట్ ఈ పుస్తకంలో ఇచ్చారు. మన సోదరులు, సోదరీమణులు చాలా మంది వారి ఇళ్ల నుంచి నిరాశ్రయులయ్యారు. అందుకే దీనిని ఎవరూ మర్చిపోలేరు. మన ప్రజల పోరాటాలు, త్యాగాల జ్ఞాపకార్థం ఆగస్టు 14వ తేదీని విభజన గాయాల స్మారక దినంగా జరుపుకుంటారు.” అని ప్రధాని తన కోట్‌లో పేర్కొన్నారు.

READ MORE: shocking incident: నాగరాజును నమిలేసిన తొమ్మిది నెలల చిన్నారి..

Exit mobile version