Viral: NCC (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) యువత అభివృధి కోసం దేశ రక్షణ కోసం ఏర్పడినదే NCC సాయుధ దళాల యువ విభాగం, క్రమశిక్షణకి పెట్టింది పేరు, మంచిని, మానవతాన్ని పెంపొందించేలా NCC విద్యార్ధులకి శిక్షణ ఇస్తారు, ఎక్కడ ఏ ఆపద ఉన్న మేమున్నాం అని వినిపించే మొదటి గళం NCC క్యాడెట్ ది అంటే అర్ధం చేసుకోవచ్చు వాళ్లకి ఎలాంటి శిక్షణ ఇస్తారో, దేశ సేవలో పాలు పంచుకోవాలని దేశ రక్షణలో తమ వంతు బాధ్యత వహించాలని ఆశపడే ఎంతోమంది యువత కి శిక్షణనిచ్చి వాళ్ళ ఆశయానికి బాటలు వేస్తూ దేశ భవితకి ఊపిరిపోసే సంస్థే NCC.
కానీ, మహోన్నతమైన NCC కి కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు ఒక NCC సీనియర్ విద్యార్థి, ఎదురుగా ఉన్నది తనలాంటి విద్యార్థులేనన్న జాలైన లేకుండా, సాటి మనుషులన్న మానవతాన్ని మరచి తను చెప్పినట్లు వినలేదని విచక్షణరహితంగా ప్రవర్తించిన తీరు అటు తోటి విద్యార్ధులకి ఇటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రతిఒక్కరికి ఆగ్రహాన్ని కలిగిస్తున్న వీడియో ఒకటి సాంఘిక ప్రసార మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది.
వివరాల్లోకి వెళ్తే ముంబై సమీపంలోని థానే బందోర్కర్ కళాశాలలో తను చెప్పిన పని చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ విద్యార్థులని జోరువానలో బురద నీటిలో.. తల నీటిలో పెట్టించి.. చేతులు వెన్నకి కట్టి.. విద్యార్థుల బ్యాక్‌పై విచక్షణ రహితంగ కర్రతో చితకబాదాడు.. వరుసగా విద్యార్థులను వంగోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు.. అయితే, ఈ దృశ్యాలను మరో విద్యార్థి.. కిటికీలో నుంచి వీడియో చిత్రీకరించాడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.. అంతేకాదు.. క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది ఆ వీడియో.. ఇక, ఈ విషయం పైన స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్ సుచిత్ర నాయక్, ఆ వీడియోలో కొడుతున్నట్టు కనిపిస్తున్న వ్యక్తి సీనియర్ విద్యార్థే.. కానీ, NCC హెడ్ లేదా ఉపాధ్యాయులు కారని స్పష్టం చేశారు.. అంతేకాదు.. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి బాగాలేక అల ప్రవర్తించాడని అతని మీద చర్యలు తీసుకుంటామని ఇంతకముందు ఇలాంటివి ఎన్నడూ జరగలేదని.. ఇకపై ఎప్పుడు జరగవని హామీ ఇచ్చారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
