Site icon NTV Telugu

NBK 111: మ్యూజిక్ వర్క్ షురూ.. థమన్ అప్‌డేట్‌తో బాలయ్య ఫ్యాన్స్‌లో డబుల్ హైప్!

Nbk111 Update

Nbk111 Update

నందమూరి బాలకృష్ణ అభిమానుల దృష్టి ప్రస్తుతం ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై ఉన్నా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK111 ప్రాజెక్ట్ గురించి వస్తున్న వరుస అప్‌డేట్‌లు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకోగా, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన చిన్న అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.

Also Read : Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్‌మెంట్..

థమన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో NBK111 మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందని ప్రకటించగానే, ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. బాలకృష్ణ పవర్‌ఫుల్ ఎలివేషన్లకు థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఎంత ప్లస్ అవుతుందో ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ వంటి సినిమాలు నిరూపించాయి. మళ్లీ ఈ కాంబోలో మ్యూజిక్ వర్క్ మొదలైందని తెలియగానే, ఫ్యాన్స్ ‘థమన్ బాదుడు’ కు రెడీ అవుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ NBK111 ఒక భారీ పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతోందని, ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేయబోతున్నారని సమాచారం. మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గోపిచంద్ మలినేని, పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్యను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బాలయ్యకు జోడీగా సీనియర్ నటి నయనతార మళ్లీ జతకట్టడం ఈ ప్రాజెక్ట్‌కు హైప్ తీసుకొచ్చింది. వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్ మొదలైన తర్వాత, సినిమాలోని పాత్రలు మరియు లుక్స్ గురించి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version