NTV Telugu Site icon

NBK 109 : బాలయ్య మూవీ లో తమన్నా ఐటమ్ సాంగ్..?

Whatsapp Image 2023 12 18 At 4.08.55 Pm

Whatsapp Image 2023 12 18 At 4.08.55 Pm

నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ ఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు..ఈ ఏడాది వీరసింహారెడ్డి మరియు భగవంత్‌ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.వరుస సక్సెస్ లు వచ్చిన జోష్‌తో బాలయ్య మరో బ్లక్ బస్టర్ కాంబో ను లైన్‌ లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ మూవీ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అయితే బాబీ తెరకెక్కించే సినిమాల లో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్​ ఉంటుందన్న విషయం తెలిసిందే.

బాబీ గతంలో ఎన్టీఆర్​తో జై లవకుశ సినిమా చేయగా.. ఈ మూవీలో ‘స్వింగ్ జర’ ఐటమ్ సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది.. దీని తర్వాత రీసెంట్‌గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న ఎన్​బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్​ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు తెలుస్తుంది.. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. సితార బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ మరియు ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు ఈ సినిమా లో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.. అయితే నట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు..ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.

Show comments