Site icon NTV Telugu

NBK 109 :సరికొత్త పాత్రలో కనిపించబోతున్న బాలయ్య..

Whatsapp Image 2023 10 06 At 10.35.57 Am

Whatsapp Image 2023 10 06 At 10.35.57 Am

నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను మాస్ డైరెక్టర్ బాబీ తో చేయబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకపై సూర్యదేవర నాగవంశీ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించబోతున్నాడు.దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్ ఇటీవల నాగవంశీ అదిరిపోయే అప్‌డేట్ రివీల్ చేశాడు.

బాలకృష్ణ పాత్ర తో పాటు యాక్షన్ అంశాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో మ్యాడ్ మూవీ ప్రమోషన్స్‌లో చెప్పేశాడు. గుంటూరు కారం తర్వాత మా బ్యానర్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీస్ లో బాలకృష్ణ, బాబీ సినిమా ఒకటని సూర్యదేవర నాగవంశీ తెలిపారు.. ఈ మధ్య కాలంలో అస్సలు టచ్ చేయని గెటప్‌, క్యారెక్టరైజేషన్‌ తో బాలకృష్ణ పాత్ర ఈ సినిమా లో కాస్త డిఫరెంట్‌గా ఉంటుందని ఆయన తెలిపాడు.అయితే ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు వచ్చే యాక్షన్‌ బ్లాక్ ఎంతో కొత్తగా ఉంటుందని, బోయపాటి శ్రీను కూడా తన సినిమాల్లో టచ్ చేయని యాంగిల్‌ తో ఈ ఎపిసోడ్స్ సాగుతాయని తెలిపారు.మాస్ హిస్టీరియా ఉన్న హీరో అలాగే మాస్ డైరెక్టర్ కలిసి చేస్తోన్న ఈ సినిమాను ఆడియెన్స్ పూర్తి గా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు.బాలకృష్ణ, బాబీ మూవీపై సూర్యదేవర నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి..

Exit mobile version