Nayanthara – Trisha: సినిమా పరిశ్రమలో ఎంతో మంది తారల మధ్య స్నేహాలు చిగురిస్తాయి, కొన్ని సందర్భాల్లో అవి మధ్యలోనే కనుమరుగు అవుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం కాలం గడిచినా రంగులు మారవు.. మసకబారవు. అలాంటి అద్భుతమైన స్నేహ బంధం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అదే లేడీ సూపర్‌స్టార్ నాయనతార – త్రిష ఫ్రెండ్‌షిప్. తాజాగా ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి సముద్ర తీరాన సేద తీరుతున్న ఫోటోలను నాయనతార తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సూర్యాస్తమయ సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఉన్న అద్భుత ఫొటోలు.. వాటికి జత చేసిన ఏ.ఆర్. రెహమాన్ మాయాజాలం – “ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా.. కాలం నమ్ తోజన్ ముస్తఫా” అనే లైన్స్‌తో ఉన్న నయనతార పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తుంది. నిజానికి ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌ది 23 ఏళ్లుగా విజయవంతమైన సినీ ప్రయాణం. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు నటీమణుల మధ్య.. ఒకప్పుడు ఇండస్ట్రీలో పోటీ, వివాదాలు, గుసగుసలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ పోటీ స్నేహంగా మారింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరినొకరు గౌరవిస్తూ, సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరి స్నేహాన్ని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
Mustafa mustafa don’t worry mustafa
Kaalam nam thozhan Mustafa❤️ @trishtrashers pic.twitter.com/poEzuYKbtD— Nayanthara✨ (@NayantharaU) January 19, 2026
READ ALSO: BCCI Prize Money: విదర్భ టీంపై కాసుల వర్షం.. బీసీసీఐ ఇచ్చిన గిఫ్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
