Site icon NTV Telugu

NBK 111 : రాజ్యంలోకి అడుగుపెట్టిన యువరాణి.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్

Nbk 111

Nbk 111

వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రాబోయే ఈ సినిమా రెగ్యులర్ మాస్ సినిమా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురి పేర్లు పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా స్టార్ హీరోయిన్ నయనతారను ను ఫిక్స్ చేసారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా అందుకు సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇదివరకు బాలయ్యతో శ్రీరామరాజ్యం, జై సింహ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పడు మరోసారి బాలయ్యతో జోడి కడుతుంది నయన్. దర్శకుడు గోపీచంద్ మలినేని చూపిన కథకు నయన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా  ఈ నెల 26న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిచబోతున్నట్టు సమాచారం. తాజగా రిలీజ్ చేసిన NBK 111 క్వీన్ గ్లిమ్స్ బీజీఎమ్ సూపర్ గా ఉందని చెప్పాలి.

Exit mobile version