NTV Telugu Site icon

Beyond the Fairytale : ఓటీటీలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ.. ఎలా ఉందంటే?

Nayan

Nayan

Beyond the Fairytale : స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి కీలక అంశాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. దీనికి అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈరోజు (నవంబర్ 18) నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ విడుదల నేపథ్యంలో.. హీరో ధనుష్, నయనతార మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించుకోనివ్వడం లేదని విమర్శిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ధనుష్‌కి నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇందులో ఆమె తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి పనిచేసింది. వివాదాల మధ్య ఓటీటీలో విడుదలైన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.

Read Also:Viral Video: రీల్ చేస్తుండగా చీరకు నిప్పు.. అరుస్తూ పరిగెత్తిన మహిళ(వీడియో)

‘నానుమ్ రౌడీ డాన్’ షూటింగ్ లొకేషన్స్ నుండి 3 సెకన్ల బీటీఎస్ విజువల్స్ ఉపయోగించినందుకు ధనుష్ తనకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ లీగల్ నోటీసు పంపినట్లు నయనతార లేఖలో పేర్కొంది. అయితే ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేసిన విజువల్స్ ను ఎట్టకేలకు డాక్యుమెంటరీ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. దాదాపు 1 గంట 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో నయనతార జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ప్రస్తావించారు. ఇది సినిమా ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆమె ప్రేమ కథ, ఆమె వైవాహిక జీవితాన్ని వివరిస్తుంది. ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ నయనతార కుటుంబం, ఆమె బాల్యం, చదువు వంటి విషయాలను చర్చిస్తూ ముందుకు సాగింది. చిన్నతనంలో ఎక్కువగా సినిమాలు చూడని నయన్ కు మలయాళంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? వంటి విషయాలను డాక్యుమెంటరీలో వివరించారు. నయనతార తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో నిరాశను ఎదుర్కొన్న తర్వాత ఎలా తిరిగి వచ్చిందో ఇది వివరించింది.

Read Also:RGV: దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ కొట్టివేత..

సినిమా ఆఫర్లు తగ్గుతున్న సమయంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫోన్ చేసి ‘బాస్’ సినిమాలో నటించమని ఎలా అడిగారో, బ్రేకప్ సమయంలో ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్రలో నటించే అవకాశం వచ్చిందనే విషయాలను అందులో చెప్పుకొచ్చారు. నాగార్జున వీడియో బైట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయాలను కూడా పొందుపరిచారు. ‘గజిని’ సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శలు, బాడీ షేమింగ్, ‘బిల్లా’ సినిమా కోసం ధైర్యంగా బికినీలు ధరించడంపై నయనతార మాట్లాడింది. ‘లేడీ సూపర్‌స్టార్‌’గా ఎదిగిన విధానాన్ని వివరించింది. ఈ డాక్యుమెంటరీలో నయనతార – విఘ్నేష్ శివన్ ల ప్రేమకథను కూడా ప్రముఖంగా వివరించారు. ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమా సమయంలో ఒకరిపై ఒకరు ఎలాంటి అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరన్న విషయాలపై వారు మాట్లాడారు. వీరి మధ్య రిలేషన్ షిప్ గురించి తెలుసుకుని వచ్చిన మీమ్స్, అప్పట్లో జరిగిన ట్రోలింగ్ పై కూడా విఘ్నేష్ స్పందించాడు. పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. నయనతార – విఘ్నేష్ శివన్ పెళ్లి వీడియోలను అందంగా చూపించారు. పెళ్లి, అందుకు సంబంధించిన సన్నాహాలు, గెస్ట్ లిస్ట్, పెళ్లి టెన్షన్, పెళ్లి దుస్తులను రూపొందించేందుకు డిజైనర్లు పడిన శ్రమ… ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. చివరగా, వారి పిల్లల పుట్టుక మరియు మరణాన్ని చూపిస్తూ డాక్యుమెంటరీ ముగిసింది.