Beyond the Fairytale : ఓటీటీలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ.. ఎలా ఉందంటే?
- ఓటీటీలోకి నయనతార డాక్యుమెంటరీ
- విఘ్నేష్, నయన్ పెళ్లి గురించి ఆకట్టుకున్న చిత్రం
- ధనుష్ తో వివాదం నడుమ హాట్ ఫేవరేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beyond the Fairytale : స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి కీలక అంశాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. దీనికి అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈరోజు (నవంబర్ 18) నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ విడుదల నేపథ్యంలో.. హీరో ధనుష్, నయనతార మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించుకోనివ్వడం లేదని విమర్శిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ధనుష్‌కి నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇందులో ఆమె తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి పనిచేసింది. వివాదాల మధ్య ఓటీటీలో విడుదలైన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.
Read Also:Viral Video: రీల్ చేస్తుండగా చీరకు నిప్పు.. అరుస్తూ పరిగెత్తిన మహిళ(వీడియో)
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
‘నానుమ్ రౌడీ డాన్’ షూటింగ్ లొకేషన్స్ నుండి 3 సెకన్ల బీటీఎస్ విజువల్స్ ఉపయోగించినందుకు ధనుష్ తనకు రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ లీగల్ నోటీసు పంపినట్లు నయనతార లేఖలో పేర్కొంది. అయితే ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేసిన విజువల్స్ ను ఎట్టకేలకు డాక్యుమెంటరీ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. దాదాపు 1 గంట 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో నయనతార జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను ప్రస్తావించారు. ఇది సినిమా ప్రయాణం, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఆమె ప్రేమ కథ, ఆమె వైవాహిక జీవితాన్ని వివరిస్తుంది. ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ నయనతార కుటుంబం, ఆమె బాల్యం, చదువు వంటి విషయాలను చర్చిస్తూ ముందుకు సాగింది. చిన్నతనంలో ఎక్కువగా సినిమాలు చూడని నయన్ కు మలయాళంలో నటించే అవకాశం ఎలా వచ్చింది? ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి? వంటి విషయాలను డాక్యుమెంటరీలో వివరించారు. నయనతార తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో నిరాశను ఎదుర్కొన్న తర్వాత ఎలా తిరిగి వచ్చిందో ఇది వివరించింది.
Read Also:RGV: దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..
సినిమా ఆఫర్లు తగ్గుతున్న సమయంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫోన్ చేసి ‘బాస్’ సినిమాలో నటించమని ఎలా అడిగారో, బ్రేకప్ సమయంలో ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్రలో నటించే అవకాశం వచ్చిందనే విషయాలను అందులో చెప్పుకొచ్చారు. నాగార్జున వీడియో బైట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయాలను కూడా పొందుపరిచారు. ‘గజిని’ సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శలు, బాడీ షేమింగ్, ‘బిల్లా’ సినిమా కోసం ధైర్యంగా బికినీలు ధరించడంపై నయనతార మాట్లాడింది. ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగిన విధానాన్ని వివరించింది. ఈ డాక్యుమెంటరీలో నయనతార – విఘ్నేష్ శివన్ ల ప్రేమకథను కూడా ప్రముఖంగా వివరించారు. ‘నానుమ్ రౌడీ థాన్’ సినిమా సమయంలో ఒకరిపై ఒకరు ఎలాంటి అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరన్న విషయాలపై వారు మాట్లాడారు. వీరి మధ్య రిలేషన్ షిప్ గురించి తెలుసుకుని వచ్చిన మీమ్స్, అప్పట్లో జరిగిన ట్రోలింగ్ పై కూడా విఘ్నేష్ స్పందించాడు. పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. నయనతార – విఘ్నేష్ శివన్ పెళ్లి వీడియోలను అందంగా చూపించారు. పెళ్లి, అందుకు సంబంధించిన సన్నాహాలు, గెస్ట్ లిస్ట్, పెళ్లి టెన్షన్, పెళ్లి దుస్తులను రూపొందించేందుకు డిజైనర్లు పడిన శ్రమ… ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. చివరగా, వారి పిల్లల పుట్టుక మరియు మరణాన్ని చూపిస్తూ డాక్యుమెంటరీ ముగిసింది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!