NTV Telugu Site icon

Nayanthara Dhanush: హీరో ధనుష్ పై నయనతార సంచలన విమర్శలు.. నువ్వేంటో ఇప్పుడు తెలుస్తుంది

New Project 2024 11 16t134418.160

New Project 2024 11 16t134418.160

Nayanthara Dhanush: స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా ఆమె నిర్మాత, స్టార్ హీరో ధనుష్‌ను బహిరంగంగానే విమర్శించింది. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది.. స్టేజ్ ఎక్కితే నీతి సూక్తులు చెబుతావు.. నీ పిచ్చి అభిమానులను మభ్య పెడతావు.. నీ సూక్తులను మాత్రం నువ్వు పాటించవు. అంటూ ఓ రేంజ్ లో ఆయనపై విరుచుకుపడింది. ధనుష్ తమ మీద వేసిన కేసుకు ప్రతిగా నయనతార ఓ సుదీర్ఘ బహిరంగ లేఖను వదిలింది. అందులో చాలా విషయాలను చెప్పుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ కోసం నయన్ విఘ్నేష్ చేసిన డాక్యుమెంటరీలో నేను రౌడీనే మూవీకి సంబంధించి ఓ మూడు సెకన్ల క్లిప్ వాడడంతో ఈ వివాదం మొదలైంది. అసలు ఏం జరిగిందో ఈ కథనంలో ఓ సారి చూద్దాం. నయనతార, విఘ్నేశ్‌లు తమ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్‌ని నెట్ ఫ్లిక్స్‌కి ఇచ్చిన విషయం తెలిసిందే. నయనతార, విఘ్నేశ్‌ల మీద డాక్యుమెంటరీని చాలా ఆలస్యంగా విడుదల చేశారు. అసలు ఇది వస్తుందా? రాదా? అని ఒకప్పుడు చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఇది ఇంత కాలం లేట్ కావడానికి ధనుష్ కూడా ఓ కారణం అని తెలుస్తోంది. తమ జీవిత ప్రయాణంలో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే అనే సినిమాకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్‌ను వాడుకుంటామని ధనుష్‌ను నయనతార రిక్వెస్ట్ చేసిందట.

Read Also:PM Modi: ఉగ్రవాదులు భారత్‌ను భయ పెట్టలేరు.. ఎందుకంటే..

అలా వాడుకునేందుకు ఎన్వోసీని ధనుష్ నుంచి కోరిందట. కానీ ధనుష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. అలా ఎన్నో సార్లు అడిగినా ధనుష్ వారికి అనుమతి ఇవ్వలేదట. తమ జీవిత ప్రయాణానికి ఆ లిరిక్స్ సరిగ్గా సెట్ అవుతాయని ఎంత రిక్వెస్ట్ చేసినా చెప్పినా ఇవ్వలేదని ధనుష్ చేసిన దానిని గురించి చెప్పారు. సర్లే ధనుష్ ఇవ్వడం లేదు కదా అని ఆ సినిమా టైంలో బిహైండ్ ది సీన్స్‌లో తమ కెమెరాల్లో తీసుకున్న విజువల్స్‌ని ఓ మూడు సెకన్ల పాటు అందులో వాడుకున్నారట. ధనుష్ అంగీకరించడం లేదు కదా అని మొత్తం ఎడిట్ చేసి, రీ షూట్ చేశారట. అలా మూడు సెకన్ల పాటు వాడుకున్నందుకు పది కోట్ల రూపాయలు కట్టమని ధనుష్ లీగల్ నోటీస్ పంపించాడట. దీనిపై నయనతార మండిపడింది. ‘నువ్వు ఎంత నిర్మాతవి అయితే మాత్రం మా పర్సనల్ లైఫ్ మీద నీకు పెత్తనం, అధికారం ఉంటుందా? సినిమాలోని సీన్లు, క్లిప్స్ వాడొద్దన్నావ్.. మా సొంత కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్స్ కూడా వాడుకోవద్దా? దీనిపై మేం కూడా కోర్టులోనే తేల్చుకుంటాం.. ఇక్కడే నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది.. స్టేజ్ ఎక్కి నాలుగు మంచి మాటలు, పంచ్ డైలాగులు చెప్పి నీ పిచ్చి అభిమానులను మభ్య పెట్టడం కాదు.. నువ్వు మాట్లాడే ముందు దానిని పాటించు.. అసలు మా మీద నీకు ఎందుకు అంత ద్వేషం.. మమ్మల్ని ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నావ్.. ఆ సినిమా సక్సెస్‌ను తరువాత నీ ఇగో ఎలా హర్ట్ అయిందో నేను విన్నాను.. నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు, దాని వల్ల అయిన గాయాలను నేను ఇంకా మర్చిపోలేను.

Read Also:Myke Tyson vs Jake Paul Fight: మైక్‌ టైసన్‌ను మట్టి కరిపించిన 27 ఏళ్ల యూట్యూబర్

నీలో నువ్వు మనశ్శాంతిని వెతుక్కుంటావ్ అని.. గతంలో నీతో ఉన్న వాళ్ల సక్సెస్‌ను చూసి కుళ్లుకోకుండా శాంతంగా ఉంటావ్ అని ఈ లెటర్ షేర్ చేస్తున్నా.. ఈ ప్రపంచం చాలా పెద్దది.. అందరిదీ.. నాలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం.. నేను ఇలా హ్యాపీగా, సంతోషంగా ఉంటే.. నీకేం నష్టం కాదు.. నీ నుంచి మేం ఏమీ తీసుకోం.. ఎవరి పని వారిది.. ఎవరి అదృష్టం వారిది.. ఇప్పుడు నువ్వు మళ్లీ ఏదో ఒక ఈవెంట్‌లో మళ్లీ పంచ్ డైలాగ్స్ వేస్తావు.. సరే మంచిదే.. అన్నీ ఆ దేవుడు చూస్తుంటాడు.. ఈ ప్రపంచంలో ఒకరి బాధను చూసి సంతోషించడం ఈజీ.. కానీ ఎదుటి వాళ్ల సంతోషంలోనే మన సంతోషం ఉంటుంది.. అదే మా డాక్యుమెంటరీ ఉద్దేశం కూడా.. నువ్వు కూడా ఆ డాక్యుమెంటరీని చూడు.. నీ మైండ్ కాస్త మారుద్దేమో.. ప్రేమను పంచడమే ముఖ్యం.. ఏదో ఒక రోజు నువ్వు కూడా అలా ప్రేమను పంచుతావని అనుకుంటున్నా’ అని నయనతార తన బహిరంగలేఖలో పేర్కొంది.

Show comments