Site icon NTV Telugu

Annapoorani : ఓటీటీ లో అదరగొడుతున్న నయనతార అన్నపూర్ణి..

Whatsapp Image 2024 01 04 At 3.03.15 Pm

Whatsapp Image 2024 01 04 At 3.03.15 Pm

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న విడుదలయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీనితో ఈ మూవీ థియేటర్స్ లో విడుదల అయి నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది.డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో కేవలం తమిళ భాషలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలైంది.అయితే థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన అన్నపూర్ణి మూవీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన సినిమాల్లో నేషనల్ వైడ్‌గా నవంబర్ వన్ ప్లేస్‌లో అన్నపూర్ణి నిలిచింది. బాలీవుడ్‌, టాలీవుడ్ సినిమాల్ని దాటేసి అన్నపూర్ణి టాప్ ప్లేస్‌లోకి వచ్చేసింది. అన్నపూర్ణి సినిమాలో సత్యరాజ్‌ మరియు జై కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా నయనతార ఈ సినిమాలో కనిపించింది. అన్నపూర్ణి చెఫ్ కావాలని కలలు కుంటుంది.తండ్రి మాత్రం ఆమెను ఎమ్‌బీఏ చేయాలని పట్టుపడతాడు. తండ్రికి ఎంబీఏ అని చెప్పి తన చిన్ననాటి స్నేహితుడు ఫర్హాన్ (జై) సహాయంతో చెఫ్‌ కోర్సులో జాయిన్ అవుతుంది తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందర్‌రాజన్ (సత్యరాజ్‌) అండతో ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీల్లో అన్నపూర్ణి ఎలా విజేతగా నిలిచింది. ఓ ప్రమాదంలో రుచి చూసే శక్తిని అన్నపూర్ణి ఎలా కోల్పోయింది అనేదే ఈ సినిమా కథ.అయితే అన్నపూర్ణి సినిమాలో నయనతార యాక్టింగ్ బాగున్నా…కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. దానితో పాటు అన్నపూర్ణి రిలీజ్ టైమ్‌లో చెన్నైలో వరదలు కూడా రావడం సినిమా వసూళ్లపై మరింత ప్రభావాన్ని చూపించింది. అన్నపూర్ణి నయనతార హీరోయిన్‌గా నటించిన 75వ మూవీగా తెరకెక్కింది అన్నపూర్ణి సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. గత ఏడాది తమిళంలో నయనతార నటించిన అన్నపూర్ణితో పాటు ఇరైవన్ కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి

Exit mobile version