లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పండుతున్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి చేసుకుంది మరెవ్వరినో కాదు తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్.. ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక వివాదం వారిని వెంటాడుతుంది.. ఇప్పుడు మరో వివాదంలో దంపతులు చిక్కుకున్నారు.. వీరిపై మరో కేసు నమోదు అయ్యిందని తెలుస్తుంది..
నయన తార – విఘ్నేశ్ శివన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులు ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్ బాబాయిలు నయనతార పేరును కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. విఘ్నేశ్ శివన్ తండ్రి శివ కొళుదు స్వస్థలం తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని లాల్‌కుడి గ్రామం. ఆయనకు ఎనిమిది మంది అన్నదమ్ముులు ఉన్నారు. శివ కొళుదు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేసేవారట. అయితే, కొన్నేళ్ల క్రితం ఆయన అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిలో కొంత భాగాన్ని తానే అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆ తరువాత ఆయన చనిపోయారు..
శివ కొళుదు అమ్ముకున్న ఆస్తి విషయమై తాజాగా ఆయన సోదరులు మాణిక్యం, కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు. తమకు తెలియకుండా శివ అమ్ముకున్న ఆస్తిని కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి తిరిగి తెచ్చుకునేందుకు సాయపడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో విఘ్నేశ్ శివన్, ఆయన భార్య నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించాలని స్థానిక పోలీసులను డీజీపీ ఆదేశించారు.. వరుస వివాదాలు నయనతారను వదలకపోవడంతో ఆమె అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు..