OMG : కాటేసిందని పాము పై ప్రతీకారం తీర్చుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OMG : పాములు పగ తీర్చుకోవడం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే పాముపై మానవుడు పగ తీర్చుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా.. కానీ అలాంటి ఉదంతం బీహార్‌లోని నవాడా నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రాజౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో రైల్వే లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. మంగళవారం అర్థరాత్రి పని ముగించుకుని కూలీలంతా తమ బేస్ క్యాంపులో నిద్రిస్తున్నారు. కాగా, జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లా పండుకాకు చెందిన సంతోష్ లోహర్‌ను పాము కాటేసింది. ఈ సంఘటన తర్వాత సంతోష్ పామును పట్టుకుని మూడుసార్లు కొరకడంతో పాము చనిపోయింది.
పాము కాటేస్తే దానిని తిరిగి మూడుసార్లు కాటేయాలని తమ గ్రామంలో ప్రచారంలో ఉందని సంతోష్ చెప్పాడు. దీని వల్ల పాము విషం తమ శరీరంలోకి ప్రవేశించడని వారి నమ్మకంగా చెప్పుకొచ్చాడు. ఈ మూఢనమ్మకాన్ని అనుసరించి సంతోష్ పామును కొరికేశాడు. దీంతో పాము మృతి చెందింది. దీంతో పాటు స్నేహితులు సంతోష్‌ను సబ్ డివిజన్ ఆస్పత్రిలో చేర్పించారు. సంతోష్ ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత బేస్ క్యాంపులో ఉన్న ఇతర కూలీల్లో చర్చనీయాంశంగా మారింది. పాము విషపూరితం కాదని ఆయన చెప్పుకొచ్చాడు.. అందుకే అంత ఆలస్యం అయినా సంతోష్ ప్రాణాలతో బయటపడ్డాడు. లేకుంటే ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగి ఉండేది.
Also Read
- EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
- Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
- CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
Read Also:NVSS Prabhakar: రేవంత్ రెడ్డి హామీలతో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు..!
పాము కాటేస్తే ఏం చేయాలి?
పాము కాటేస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వాపు ప్రారంభమయ్యే ముందు శరీరానికి ఉండే రింగులు, గడియారాలను తొలగించాలి. వీలైతే, సురక్షితమైన దూరం నుండి పామును ఫోటో తీయండి. పామును గుర్తించడం పాము కాటుకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. మీకు మీరుగా ఆసుపత్రికి వెళ్లవద్దు. ఎందుకంటే పాముకాటుతో బాధపడే వ్యక్తికి కళ్లు తిరిగినట్లు అనిపించవచ్చు. అతను మూర్ఛపోవచ్చు.
పాము కాటుకు గురైనప్పుడు ఏమి చేయకూడదు?
పామును ముట్టుకోవద్దు లేదా ట్రాప్ చేయడానికి ప్రయత్నించవద్దు. విషపూరితమైన పామును, చచ్చిన పామును లేదా దాని తెగిపడిన తలను కూడా తాకవద్దు. కత్తితో గాయాన్ని కత్తిరించవద్దు. విషాన్ని పీల్చడానికి కూడా ప్రయత్నించవద్దు. గాయానికి ఐస్ పెట్టవద్దు మరియు గాయాన్ని నీటిలో ముంచవద్దు. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మద్యం తాగవద్దు. నొప్పి నివారణ మందులు తీసుకోవద్దు. కరెంట్ షాక్, భూతవైద్యం చేయవద్దు.
Read Also:POCSO Case: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..! మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!