NTV Telugu Site icon

Navjot Kaur Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు క్యాన్సర్‌.. జైలులో ఉన్న భర్తకు భావోద్వేగ లేఖ

Cancer

Cancer

Navjot Kaur Sidhu: పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ తనకు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈరోజు తర్వాత ఆమెకు శస్త్రచికిత్స చేయబోతున్నారని ట్విట్టర్‌లో వెల్లడించారు.1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న తన భర్తకు ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగ లేఖ రాసింది. “అతను(నవజ్యోత్‌ సిద్ధూ) చేయని నేరానికి జైలులో ఉన్నాడు. పాల్గొన్న వారందరినీ క్షమించండి. బయట ప్రతి రోజూ నీ కోసం ఎదురుచూస్తూ బహుశా నీకంటే ఎక్కువగా బాధపడుతుంటాను. ఎప్పటిలాగే మీ బాధను తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాను”అని నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఒక ట్వీట్‌లో తెలిపారు.

మీ కోసం ఎదురుచూస్తూ ఉంటానని నవజ్యోత్ కౌర్ సిద్ధూ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు 1988లో జరిగిన రోడ్డు రేజ్ కేసులో మే 19, 2022న ఏడాది జైలు శిక్ష పడింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చర్యలు తీసుకున్నారు.

Read Also: Mamata-Naveen Meeting: నవీన్‌ పట్నాయక్‌ను కలిసిన మమత.. థర్డ్ ఫ్రంట్‌ కోసమేనా?

నవజ్యోత్ కౌర్ ట్వీట్‌పై మాజీ కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ స్పందించారు. మీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సిరావడం విచారకరం. ఇది సమయానికి గుర్తించబడింది. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. వాహెగురు మెహర్ కరణ్ అంటూ ట్వీట్ చేసారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1988లో జరిగిన రోడ్డు వివాదంలో సిధ్దూ ఒక వ్యక్తి పై దాడి చేయడంతో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్నారు. అతను 2018లో రూ.1,000 చిన్న జరిమానాతో విడిచిపెట్టబడ్డారు. కాని తరువాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది.

Show comments