NTV Telugu Site icon

NaveenulHaq : నేనుందుకు సారీ చెప్పాలి.. చెప్పను పో..

Naveem Ul Haq

Naveem Ul Haq

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటర్ గంభీర్‌ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఐపీఎల్‌-2023లో లక్నో , ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా వీరిద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. ఈ ఏడాది సీజన్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క వికెట్‌ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత గంభీర్ నోటి మీద వేలు వేసుకొని.. ఇక నోరు మూసుకోండి అన్నట్టుగా సైగలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : Virat Kohli Fan : విరాట్ కాళ్లు మొక్కిన అభిమాని.. హగ్ ఇచ్చిన కోహ్లీ

ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో రివేంజ్‌ మైండ్‌ సెట్‌తో విరాట్ కోహ్లీ బరిలోకి దిగినట్లు క్లియర్ గా కనిపించింది. లక్నో వికెట్లు పడినప్పుడు ఓవర్‌గా సెల్రబేషన్స్‌ చేయడం, ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ లాంటివి చేశాడు. ఈ క్రమంలో లక్నో ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌లో పేసర్‌ నవీన్‌ ఉల్‌-హక్‌, కోహ్లీ మధ్య చిన్న పాటి వార్ జరిగింది. అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడువ సద్దుమణిగింది. అయితే అది అక్కడతో ఆగలేదు. మ్యాచ్‌ అనంతరం షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చే సమయంలో మళ్లీ నవీన్‌ ఉల్‌-హక్‌, కోహ్లి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

Also Read : WhatsApp : భారత్ లో 47 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్

చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్‌ మైర్స్‌ కోహ్లీతో మాట్లాడతుండగా.. గంభీర్‌ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్‌, కోహ్లీ మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఇక గొడవ అంతా సద్దుమణిగాక విరాట్‌ కోహ్లీ, లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బౌండరీ లైన్‌ వద్ద నిల్చుని మాట్లాడుతున్నారు.

Also Read : Quad Summit 2023: చైనాకు చెక్ పెట్టేలా క్వాడ్ మీటింగ్

దీంతో అటుగా వచ్చిన నవీన్‌ ఉల్‌-హక్‌ను కోహ్లీకి క్షమాపణ చెప్పమని రాహుల్‌ అడిగాడు. అయితే నవీన్‌ మాత్రం నేనేందుకు క్షమాపణ చెప్పాలి అన్నట్లుగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక నవీన్‌ ఉల్‌-హక్‌ ప్రవర్తనపై విరాట్‌ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గేమ్ లో ఇలాంటివి కామన్.. దాన్ని సీరియస్ గా తీసుకుని సారీ చెప్పకపోవడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత తలపొగరా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.