Site icon NTV Telugu

Naveen Polishetty: అవకాశాలకోసం కృష్ణానగర్ లో చెప్పులు అరిగేలా తిరిగా..!

Naveen Polishetty

Naveen Polishetty

Naveen Polishetty: సినిమ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంటే అంత సులువు ఏమి కాదు.. ఎన్నో కష్టాలు, నష్టాలు ఇలా అన్ని భరించిన తర్వాతే ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించించుకోవచ్చు. ఇందుకు హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి ప్రయాణం కూడా ప్రత్యేకం కాదు. తన విజయానికి వెనుక ఎంతో కష్టం, నిరాశ, ప్రయత్నం, ఆత్మవిశ్వాసం దాగి ఉన్నాయో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ తన స్ట్రగుల్ డేస్‌ను ఓపెన్‌గా పంచుకున్నాడు.

తెలుగు కుర్రాడిగా టాలీవుడ్‌ లోనే అవకాశాలు వెతకకుండా బాంబే వెళ్లడం వెనుక కారణం తెలుపుతూ.. ఇక్కడ ఎన్నో ఆడిషన్లు ఇచ్చినా సరైన ఛాన్స్ రాలేదన్నారు. కాలేజ్ రోజుల నుంచే థియేటర్‌పై ప్రేమ పెంచుకున్న నవీన్.. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే స్టేజ్ పై నటించడం, హిందీ నాటకాలు, థియేటర్ బ్యాక్‌స్టేజ్ పనులు చేస్తూ నటనలో పూర్తి అవగాహన సంపాదించాడన్నారు.

Virat Kohli Mystery Drink: ఇండోర్ వన్డే మ్యాచ్‌.. విరాట్ కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ఏంటి?

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి టెన్త్ క్లాస్‌లోనే తెలుసుకున్నానని, చిన్నప్పటి నుంచే నటన ఒక్కటే లక్ష్యంగా ముందుకు వెళ్లానని అన్నారు. అయితే తండ్రి పెట్టిన కండిషన్ ప్రకారం ముందుగా ఇంజినీరింగ్ పూర్తి చేయాల్సి వచ్చిందిని.. నటుడవ్వాలనే లక్ష్యంతోనే ఇంజినీరింగ్‌లో కూడా టాప్ మార్క్స్ తెచుకున్నానని అన్నాడు. అలా ఇంజినీరింగ్ పూర్తయ్యాక బాంబే వెళ్లిన అసలు షాక్ ఎదురైంది. అప్పట్లో ఆడిషన్ సిస్టమ్ ఏమాత్రం ఆర్గనైజ్‌గా లేదని.. ఏ ఆఫీస్‌కు వెళ్లాలి, ఎవరు అవకాశమిస్తారనే స్పష్టత లేకుండా రోజులు గడిచిపోయాయని అన్నారు.

ధర్మ ప్రొడక్షన్స్, యశ్‌రాజ్, ఎక్సెల్ వంటి ఆఫీసుల ముందు రోజూ నిలబడటం, సెలబ్రిటీల వెనకాల పరుగెత్తుతూ పోర్ట్‌ఫోలియో ఇవ్వడం, గణేష్ పండల్స్ దగ్గర బాలీవుడ్ దర్శకుల కోసం ఎదురు చూడడం ఇవన్నీ తన రోజువారీ జీవితం అయ్యాయని నవీన్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రయత్నాలు చేసిన ఫలితం రాకపోయినా.. ‘నేను ప్రయత్నం చేయలేదు’ అనే గిల్ట్ మాత్రం ఉండకూడదనే భావనతో ప్రతిరోజూ ఎఫర్ట్ పెట్టేవాడినని అన్నారు. చివరికి ఇలా ఎదురు చూసే బదులు మనమే అవకాశాలు సృష్టించుకోవాలని నిర్ణయించుకుని యూట్యూబ్ వైపు వెళ్లానని చెప్పుకొచ్చాడు.

రైటింగ్ ఇంటర్న్‌గా పని చేస్తూ యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో తనకు ఓ దారి కనిపించిందని అన్నారు. తనలాంటి మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన కంటెంట్ క్రియేటర్లతో కలిసి ఒక చిన్న రూమ్‌లో రోజుకు 18 గంటలు పని చేస్తూ నెలల తరబడి ఒక్క వీడియోపై కష్టపడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇదే సమయంలో తన వీడియోలు చూసిన దర్శకుడు స్వరూప్ నుంచి మెసేజ్ రావడంతో జీవితంలో కీలక మలుపు తిరిగిందని చెప్పుకొచ్చాడు.

మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, OLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్స్ తో Motorola edge 70 fusion..!

హైదరాబాద్‌కు వచ్చి రైటింగ్ టీమ్‌లో చేరి నెలల తరబడి స్క్రిప్ట్‌పై పనిచేసిన తర్వాత పుట్టిందే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అని తెలిపాడు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో తనకు గుర్తింపు లభించిందన్నారు. ఆ తర్వాత జాతిరత్నాలు, ఇప్పుడు మహేష్ బాబు ప్రాజెక్ట్ వరకు వచ్చిన తన జర్నీ గురించి మాట్లాడుతూ.. స్టార్‌డమ్ అనేది ముందుగా యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్స్ వల్లే వచ్చిందని, ఆ నమ్మకమే ప్రొడ్యూసర్లకు ధైర్యం ఇచ్చిందని నవీన్ స్పష్టం చేశాడు.

టాలీవుడ్‌లో తను తక్కువేమి స్ట్రగుల్ చేయలేదని.. కృష్ణనగర్‌లో చెప్పులు అరిగేలా ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ తిరిగానని అప్పటి రోజులా గురించి చెప్పుకొచ్చారు. సినిమా అనేది బిజినెస్ అని, కంటెంట్ లేకుండా ప్రొడ్యూసర్లు రిస్క్ తీసుకోరని, అందుకే ముందుగా మనమే మనను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని తన అనుభవం ఆధారంగా చెప్పాడు. ఎంత కష్టం ఎదురైనా వెనక్కి తగ్గకుండా, అవకాశాల కోసం ఎదురుచూడకుండా వాటిని సృష్టించుకోవడమే తనను ఇక్కడి వరకూ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.

Exit mobile version