Naveen Polishetty:ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడేలా చేసాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. ఈ రెండు సినిమాలతో వరుస సినిమా అవకాశాలు అందుకోవడమే కాకుండా స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్న నవీన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా నవీన్.. యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ సరసన అనుష్క శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి అనుష్క పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇందులో స్వీటీ.. చెఫ్ గా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచో ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో అభిమానులు మరోసారి యూవీపై అసహనం వ్యక్తం చేయగా.. ఎట్టకేలకు ఒక తాజా అప్డేట్ తో వచ్చేశాడు జాతిరత్నం. రేపు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేయననున్నట్లు నవీన్ ఒక వీడియో ద్వారా తెలిపాడు.
Upasana Konidela: కొణిదెల వారసుడు పుట్టేది ఇండియాలోనే..
ఎప్పటిలానే నవీన్ తనదైన కామెడీతో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అనుష్కతో మాట్లాడుతున్నట్లు వీడియోలో మాట్లాడుతూ ఆమె అటెన్షన్ కోసం తిప్పలు పడుతున్నట్లు కనిపించాడు. స్వీట్ ఫేవరేట్ హీరోను నేనే అంటూ చెప్పుకొచ్చాడు. మీడియా ముందు చెప్పడం సిగ్గు కదా అంటూ అతనే సిగ్గుల మొగ్గలేశాడు. ఇక స్వీటీ సినిమా పోస్టర్లను చూపిస్తూ రెండు, మూడు టైటిల్స్ ను చెప్పుకొచ్చాడు. దేవసేనా.. నీ మనసులో ఉన్నది..నేనేనా అని ఒకటి.. స్వీటీతో ఎవడీ క్యూటీ.. అంటూ టైటిల్స్ చెప్తూ ఉండగా.. అనుష్క కోపం తో ఉన్న పోస్టర్స్ ను చూపించి నవ్వించాడు. చివరికి రేపు టైటిల్ వస్తుంది వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా మొదలు అయినప్పటినుంచి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. మరి ఇదే టైటిల్ ను పెట్టారా..? లేదా..? అనేది చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Get ready for a crazy ride tomorrow 🤩
Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar @UV_Creations #ProductionNo14 #Anushka48 #NaveenPolishetty3 #KotagiriVenkateswararao pic.twitter.com/6Atsc9LHzQ
— UV Creations (@UV_Creations) February 28, 2023
