ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు కంటే హాట్ టాపిక్ గా బెంగళూరులో జరిగిన రేవు పార్టీ సంబంధించిన విశేషాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. దీనికి కారణం రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అలాగే వారి అనుచరులు, మరి కొంతమంది సినీ తారలు ఈ రేవు పార్టీతో సంబంధం కలిగి ఉండడంతో అనేక వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. రేవ్ పార్టీ వద్ద పట్టుబడిన కారుకు ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ ఉండడంతో ఆ వార్త కూడా కాస్త వైరల్ గా మారింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకు సంబంధించిన కొంతమంది పేర్లు ప్రస్తుతం వినిపించడంతో ఇందుకు సంబంధించిన విశేషాలు వైరల్ గా మారాయి.
Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..
ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో తన పేరు రేవు పార్టీలో లేనందుకు తెగ ఆనందపడిపోతున్నాడు. ఆయన మరెవరో కాదు హీరో ‘నవదీప్’. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు, ఎక్కడ ఏ డ్రగ్ కేసులో విచారణ జరిగిన సినీ ఇండస్ట్రీ నుండి అటెండెన్స్ వేయించుకునే మొదటి వ్యక్తి ఆయనే. ఇదివరకు పోలీసులు అనేకమార్లు నవదీపును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పేరిట విచారణ జరిగిన సంఘటనలు చాలామంది చూసాం. ఆ సమయంలో హీరో నవదీపును కూడా చాలాసార్లు మీడియా టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఎవరైనా సినిమా ఆర్టిస్టులు పట్టు పడ్డారంటే చాలు అందులో నవదీప్ పేరుతో కథనాలు రావడం సహజంగా మారంది. కాకపోతే సెన్సేషనల్ క్రియేట్ చేసిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఆయన పేరు ఎక్కడ కూడా వినిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారిగా స్పందించారు.
Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..
ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు మీడియా తనని వదిలి పెట్టిందంటూ సంతోషపడుతూ మాట్లాడాడు. అలాగే తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు రూమర్స్ రాక పోవడంతో చాలా మంది నిరుత్సాహపడి ఉంటారని కాస్త సెటైర్ గా మాట్లాడాడు. మరికొందరైతే ఏంటన్నా ఈసారి నువ్వు ఫేక్ న్యూస్ లో కనిపించలేదంటూ కూడా ఆయనను అడిగినట్లు నవదీప్ తెలిపాడు. ఈసారి తనకు మంచి జరిగిందని., తనను ఈసారి ఒక్కసారి మీడియా వదిలేసిందని కాస్త ఫన్నీగా తెలిపారు. ఇక రేవు పార్టీ అంటే కాస్త కొత్త అర్థాన్ని కూడా ఇచ్చాడు నవదీప్. రాత్రి, పగులు జరిగే పార్టీని రేవు పార్టీ అంటారు అంటూ తనదైన శైలిలో నిర్వచించాడు నవదీప్.