Site icon NTV Telugu

Srinagar Blast: శ్రీనగర్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు..

Ka

Ka

Srinagar Blast: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగామ్ పేలుడు తర్వాత జమ్మూకశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. డీజీపీ నళిన్ ప్రభాత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు.

READ MORE: Vishnupriya : విష్ణుప్రియ అందాల ఘాటు.. మొత్తం చూపించేస్తోంది

శుక్రవారం రాత్రి 11:22 గంటలకు జరిగిన ఈ పేలుడులో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన 30 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పేలుడు చాలా తీవ్రంగా ఉంది. మంటలు, పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంటసేపు లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డాయి.

READ MORE: Priyanka Chopra : ప్రియాంక చోప్రా తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా..?

ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనను రెండు ప్రధాన కోణాలల్లో దర్యాప్తు చేస్తున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇటీవల.. ఉగ్రవాదుల నుంచి జప్తు చేసిన దాదాపు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాన్ని పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. మేజిస్ట్రేట్ సమక్షంలో దానిని సీలు చేస్తున్నప్పుడు పేలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లేదా.. ఉగ్రకోణం ఏదైనా ఉందా? అని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జప్తు చేసిన ఉగ్రవాదికి చెందిన కారును స్టేషన్‌ పరిధిలో ఉంచారు. అందులో IED అమర్చబడి ఉందా? అందులోని అమ్మోనియం నైట్రేట్ పేలిపోయిందా? అనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు.

Exit mobile version