Site icon NTV Telugu

Congress vs BJP: బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత..

Ntv

Ntv

Congress vs BJP: తెలంగాణలో బీజేపీ కార్యాలయాల వద్ద ఉ‍ద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్‌ శ్రేణులు యత్నించాయి. గాంధీభవన్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆందోళన చేపట్టారు. దీంతో గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్నో వాలో వచ్చారు.. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు.. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బారికేడ్ లకు ఇటువైపు బీజేపీ కార్యకర్తలు నిలబడ్డారు.. బీజేపీ నేతల చేతిలో కర్రలు ఉండటం ఉద్రిక్తతకు దారి తీసింది.

READ MORE: Collectors’ Conference: ఆరు జిల్లాల కలెక్టర్ల బెస్ట్ ప్రాక్టీసెస్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సీఎం ఆదేశాలు..

ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని.. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసు విషయంలోనూ అదే జరిగిందని తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెప్తామన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది. గాంధీ పేరుని సైతం తొలిగిస్తుందన్నారు. న్యాయం గెలివడానికి సమయం పట్టొచ్చు.. కానీ చివరికి గెలిచేది న్యాయమే.. నేషనల్ హెలర్డ్ పేపర్ గురించి బీజేపీకి ఏమి తెలియదు.. మా మార్గమే అహింస మార్గం.. అలాగే శాంతుయుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని వెల్లడించారు. మరోవైపు.. ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.. “రాహుల్, సోనియా గాంధీ పై బీజేపీ అక్రమ కేసు లు పెడుతుంది. ఢిల్లీ కోర్టు లో ఈడీ వేసిన ఛార్జిషీట్ ని కొట్టివేసింది. స్వాతంత్ర్యం నుంచి ఉన్న పేపర్ నేషనల్ హెరాల్డ్. దేశ కోసం ఆస్తులు త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబంపై కావాలనే బీజేపీ వేధింపులకు గురి చేస్తుంది. ఇదే అంశాన్ని మేము ప్రజలోకి తీసుకెళ్తాం.” అని వ్యాఖ్యానించారు.

Exit mobile version