జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం (అక్టోబర్ 17) జరగబోతోంది. ఈ వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతుంది.ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే తన సతీమణి తో ఢిల్లీకి చేరుకున్నారు.జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా ఆరు కేటగిరి లలో అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తరఫున డైరెక్టర్ రాజమౌళి తో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కూడా ఢిల్లీ కి వెళ్లారు. ఈ సినిమా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతల కు అందజేయనున్నారు.. దీని కోసం దేశవ్యాప్తం గా ఉన్న సినీ ప్రముఖులంతా తరలి వచ్చారు.జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల కు ప్రారంభమవుతుంది. ఈ వేడుకను డీడీ నేషనల్ ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు.
ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూడాలనుకుంటే డీడీ నేషనల్ యూట్యూబ్ ఛానెల్ లో కూడా చూడొచ్చు. ఈ విషయాన్ని డీడీ నేషనల్ ఛానెల్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా వెల్లడించింది.”69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల కార్యక్రమం ఢిల్లీ లో ని విజ్ఞాన్ భవన్ లో జరగబోతోంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి డీడీ నేషనల్లో లైవ్ చూడండి” అని ట్వీట్ చేసింది. బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్, బెస్ట్ యాక్ట్రెస్ కృతి సనన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. పుష్ప మూవీ కి గాను అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోగా.. మిమి సినిమా కు గాను ఉత్తమ నటి గా కృతి సనన్ అవార్డు గెలుచుకుంది.కృతితోపాటు గంగూబాయి కఠియా వాడి మూవీ కి గాను ఆలియా భట్ కూడా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఆమె కూడా తన భర్త రణ్‌బీర్ తో కలిసి ముంబై నుంచి ఢిల్లీ కి వెళ్లింది.