Site icon NTV Telugu

Rakesh Tikait: ఢిల్లీలో రైతుల ఆందోళనలో కనిపించని రాకేష్ టికాయిత్..

Rakesh

Rakesh

farmers protest: హర్యానా- పంజాబ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే, రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. అయితే, 2020 రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్ ఈ ఉద్యమంలో మాత్రం కనిపించడం లేదు.. అలాగే, ఆందోళనలో ఆయన చురుకుగా కనిపించకపోవడం గమనార్హం.

Read Also: Reliance Industries : 20 లక్షల కోట్ల మైలురాయిని దాటిన తొలి కంపెనీ.. చరిత్ర సృష్టించిన రిలయన్స్

అయితే, రాకేష్ టికాయిత్ లాంటి నాయకులు ఈ ఉద్యమంలో లేకపోవడం రైతుల ఉద్యమంలో చీలికలు ఉన్నాయని ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిరసనల సమయంలో రైతులు మొదట సంయుక్త కిసాన్ మోర్చా (SKM) కింద ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయగా.. అందులో అంతర్గత విభేదాలు వచ్చాయి. దీంతో కిసాన్ మోర్చాలో ఐక్యత లోపించింది. అలాగే, 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నాయకులు రాజకీయ భాగస్వామ్యాన్ని సమర్థించగా.. మరికొందరు తటస్థతంగా ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చారు. మరి కొంత మంది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లాంటి రాజకీయ పార్టీలతో పొత్తును కోరుకున్నారు.

Read Also: JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్‌ 2024 ఫలితాలు.. 10 మంది తెలుగు విద్యార్థులకు 100 శాతం స్కోరు!

ఇక, రైతుల ఉద్యమంపై జర్నలిస్టుల ప్రశ్నలకు రాకేష్ టికాయిత్ సమాధానమిస్తూ.. రైతుల ఉద్యమాన్ని కిసాన్ యూనియన్ పిలుపునిచ్చిందన్నారు. వారికి ఏదైనా అన్యాయం జరిగితే దేశం మొత్తం వారి వెంటే ఉంటుంది అని తెలిపారు. రైతులు మనకు దూరం కాదు.. ఢిల్లీ కూడా మనకు దూరం కాదన్నారు. అందరి డిమాండ్లు ఒక్కటే.. రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ నివేదిక అమలు, ఎంఎస్‌పీ గ్యారెంటీ చట్టం, పంటల ధరలు రైతుల డిమాండ్‌ చేస్తున్నారని టికాయిత్ చెప్పుకొచ్చారు. ఇక, మరోవైపు సంబు సరిహద్దులో రైతులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రైతులను అడ్డుకునేందుకు అక్కడ మోహరించిన సైనికులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Exit mobile version